ప్రేక్షకుల నోట ఆ మాట వినాలని ఉంది: శివానీ నాగారం

Published on Tue, 02/17/2026 - 00:09

‘‘వేగంగా వంద సినిమాలు చేయడం కంటే.. నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఐదు సినిమాలు చేసినా చాలు’ అనుకునే మనస్తత్వం నాది. వెంట వెంటనే సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావు అని కొందరు నాతో అన్నారు. కానీ, ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట ప్రేక్షకుల నోట వినాలని ఉంది. సెలక్టివ్‌గా సినిమాలు చేసే సాయిపల్లవి, నిత్యామీనన్‌గార్ల బాటలోనే నేను కూడా పయనిస్తాను’’ అని చెప్పారు హీరోయిన్‌ శివానీ నాగారం. 

సుహాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘హే బల్‌వంత్‌!’ (హే భగవాన్‌ టైటిల్‌ను హే భల్‌వంత్‌! గా మార్చారు). గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్‌ కానుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం హైదరాబాద్‌. గాయనిగా కెరీర్‌ను ప్రారంభించాను. యాక్టర్‌గా తొలిసారి సుహాస్‌తో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘లిటిల్‌ హార్ట్స్‌’ మూవీ చేశాను. ఇప్పుడు మళ్లీ సుహాస్‌తో ‘హే బల్‌వంత్‌’ చేశాను.

నా పాత్రలో అమాయకత్వంతో పాటు కామెడీ కూడా ఉంటుంది. నరేశ్, వెన్నెల కిషోర్, సుదర్శన్‌గార్ల కామెడీ నవ్విస్తుంది. సెకండాఫ్‌లో ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్‌ ఉంది. తెలుగు అమ్మాయిలకు ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలకు చాన్స్‌ వచ్చింది.. వివరాలు త్వరలోనే చెబుతాను. మంచి కథ, క్యారెక్టర్‌ ఉంటే ఓటీటీ ప్రాజెక్ట్స్‌ చేస్తాను. అవకాశం వస్తే సింగర్‌గాను నిరూపించుకోవాలని ఉంది’’ అని చెప్పారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)