Breaking News

కాబోయే భర్త అలా ఉండాలన్న సదా.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sun, 08/21/2022 - 10:57

‘వెళ్లవయ్యా.. వెళ్లు..’ అనే డైలాగ్‌ వినపడగానే టక్కున గుర్తోచ్చే హీరోయిన్‌ సదా. ‘జయం’ మూవీతో తెలుగు తెరపై కనిపించిన సదా తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. అందులో ఆమె చెప్పే ఈ డైలాగ్‌ ఎంతగా ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఈ సిగ్నేచర్ డైలాగ్‌ను చాలా మంది ఫాలోవుతున్నారు. ఆ తర్వాత వరుసగా స్టార్‌ హీరోల సరసన నటించినప్పటికీ జయం ఇచ్చిన గుర్తింపును ఆమె నిలుపుకోలేకపోయింది. క్రమంగా అవకాశాలు తగ్గడంతో కొంతకాలం నటనకు బ్రేక్‌ ఇచ్చింది. దీంతో బుల్లితెర డాన్స్‌ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్న తాజాగా హోల్డ్‌ వరల్డ్‌ అనే సిరీస్‌తో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చింది.

చదవండి: స్టార్స్‌ మేకోవర్‌, న్యూ లుక్కు.. వెరీ కిక్కు

ఈ సిరీస్‌ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె పెళ్లి, ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా సదా మూడు పదుల వయసులో ఉన్న ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాబోయే భర్త గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.  ఈ సందర్భం ఆమె పెళ్లిపై స్పందిస్తూ.. ‘నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది నన్ను పెళ్లి చేసుకోండి  అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. మన జీవితం మీద కామెంట్స్ చేసే హక్కును వారికెవరిచ్చారు. అలాంటి వారికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి. ప్రస్తుతం పది మంది పెళ్లి చేసుకుంటే అందులో 5 జంటలైనా పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నాయా? ఎవరూ హ్యాపీగా ఉండడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. 

చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన

అలాగే కాబోయే భర్త గురించి చెబుతూ.. ‘నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను. పార్టీలకు, పబ్స్‌కు వెళ్లను. ఆల్కహల్, నైట్ ఔట్స్ చేయను. ఒక వ్యక్తిపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేరు. ఎవరో నన్ను సంతోషంగా ఉంచాలని ఎందుకు అనుకోవాలి. నీ సంతోషం కోసం నువ్వు మరో వ్యక్తిపై ఆధారపడాల్సిన అవసం ఏముంది. నీ ఒత్తిడి కూడా అతనే భరించాలి. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వెజిటెరియన్‌ అయ్యి ఉండాలి. అతడు ధనవంతుడు కానక్కర్లేదు. ఒకరిపై ఆధారపడకుండా ఉంటే చాలు. ముఖ్యంగా నా సంపాదనపై అతడు ఆధారపడొద్దు. అలాంటి వాడు దొరికనప్పుడే పెళ్లి చేసుకుంటా’ అంటూ వివరణ ఇచ్చింది. 

Videos

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

Photos

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)