Breaking News

ఎప్పటికీ రుణపడి ఉంటా.. ఎల్లలు లేని ఆనందంలో రుక్మిణి

Published on Thu, 09/25/2025 - 07:15

కెరీర్‌ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంటే మనసు ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతుంది. నటి రుక్మిణి వసంత్‌ ఇప్పుడు అలాంటి ఆనందంలో తేలిపోతున్నారు. 2019లో మాతృభాషలో కథానాయకిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ కన్నడ బ్యూటీ ఆ తరువాత హిందీలో అప్‌స్టార్ట్స్‌ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులోకి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ దిగుమతి అయిన ఈమె తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ఏస్‌ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. 

ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, శివకార్తికేయన్‌ సరసన నటించిన మదరాసీ చిత్రం విజయానందాన్నిచ్చింది. కాగా ప్రస్తుతం కన్నడం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె కన్నడంలో రిషబ్‌ శెట్టితో నటించిన కాంతార. చాప్టర్‌ 1 చిత్రం అక్టోబర్‌ 2న పాన్‌ ఇండియా చిత్రంగా తెరపైకి రానుంది. దీనితో పాటూ యష్‌ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్‌తో పాటు తెలుగులో ఎన్టీఆర్‌ సరసన డ్రాగన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక భేటీలో రుక్మిణి వసంత్‌ పేర్కొంటూ  తనను నటిగా అంగీకరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్నారు. 

కాంతార చాప్టర్‌ 1 తనకు చాలా ముఖ్యమైన చిత్రం అన్నారు. తన నటనను చూసిన రిషబ్‌ శెట్టి అద్భుతం అన్న అభినందనను జీవితంలో మరిచిపోలేనన్నారు. అదే విధంగా అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు తన మనసు ఎల్లలు లేని ఆనందంలో మునిగితేలుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని భగవంతుని వేడుకుంటున్నానని నటి రుక్మిణి వసంత్‌ పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అమ్మడి కెరీర్‌ మంచి జోష్‌లో సాగుతోందన్నమాట.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)