Breaking News

పెళ్లి చేసుకోలేదు.. తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికైనా..

Published on Fri, 07/25/2025 - 20:15

ఆనందం సినిమా హీరోయిన్‌ గుర్తుందా? రేఖ వేదవ్యాస్‌ (Rekha Vedavyas).. 2001లో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమా ఆనందంతోనే సెన్సేషన్‌ అయింది. ఒకటో నెంబర్‌ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, ప్రేమించుకున్నాం.. పెళ్లికి రండి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. 2014 తర్వాత వెండితెరకు గుడ్‌బై చెప్పిన ఈ బ్యూటీ రెండేళ్లక్రితం ఓ షోలో ప్రత్యక్షమైంది.

రీఎంట్రీకి రెడీ..
పూర్తిగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. అనారోగ్యంతోనే సన్నబడినట్లు ఆ షోలో వెల్లడించింది. తాజాగా ఆమె రీఎంట్రీకి రెడీగా ఉన్నట్లు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రేఖ వేదవ్యాస్‌ మాట్లాడుతూ.. చిన్నవయసులోనే కెరీర్‌ ప్రారంభించాను. నేను కన్నడ అమ్మాయి కావడంతో సాండల్‌వుడ్‌కు షిఫ్ట్‌ అయిపోయి అక్కడే ఎక్కువ సినిమాలు చేశాను. అప్పుడు నాకు గైడెన్స్‌ ఇచ్చేవాళ్లు లేకపోవడంతో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. 

తీవ్ర అనారోగ్యంతో సమస్యలు
2014 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాను. ఒకానొక సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. చాలా నరకం అనుభవించాను. చాలాకాలం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు భరించడం అంత ఈజీ కాదు. ఆ బిల్లులు చెల్లిండానికైనా మళ్లీ సినిమాలు చేయాల్సిందే! సినిమాలే కాదు.. యాక్టింగ్‌ పరంగా ఏ ప్రాజెక్టుల్లోనైనా నటిస్తాను.

పెళ్లి చేసుకోలేదు
ఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలనుకుంటున్నాను. లేటుగా పెళ్లి చేసుకున్నా సరే ఆ బంధం జీవితాంతం కొనసాగేలా చూసుకుంటాను అని రేఖ వేదవ్యాస్‌ చెప్పుకొచ్చింది. ఇన్ని చెప్పింది కానీ, తనకు వచ్చిన వ్యాధి ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు. బాధల్ని చెప్పకపోవడమే మంచిదంటూ తన అనారోగ్యానికి గల కారణాన్ని సస్పెన్స్‌గానే ఉంచింది.

చదవండి: అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)