Breaking News

నటి రన్యారావు తెచ్చిన బంగారం ఎన్ని కేజీలో తెలుసా..?

Published on Fri, 02/27/2026 - 09:04

బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు ఇప్పట్లో విడుదలయ్యే ఛాన్స్‌ లేదని తెలుస్తోంది. విదేశాల నుంచి  ఒక ఏడాదిలోనే 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు తాజాగా ఈడీ అధికారులు గుర్తించారు. దాని మార్కెట్‌ రూ.102 కోట్లుగా పీఎంఎల్‌ఏ న్యాయస్థానంలో ఈడీ తమ అభియోగపత్రంలో పేర్కొంది. 2025లో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోదా చేయగా ఆమె వద్ద అక్రమంగా రవాణ చేస్తున్న రూ.12 కోట్ల విలువ చేసే బంగారం లభించింది. 

దీంతో ఆమెను అరెస్ట్‌ చేసి విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం ద్వారా అక్రమంగా కూడబెట్టిన డబ్బు  మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని డీఆర్‌ఐ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. సుమారు 10నెలలకు పైగా పరప్పన అగ్రహార జైల్లో ఆమె ఉంది.బెయిల్‌ కోసం పలుమార్లు పిటీషన్‌ పెట్టుకున్నప్పటికీ కోర్టులు కొట్టివేస్తూ వస్తున్నాయి.

రన్యా రావు 2023 నుంచి 2025 వరకు దుబాయ్‌కు ఏకంగా 56 సార్లు ప్రయాణించినట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో స్పష్టమైంది. దుబాయ్‌ పర్యటనలో భాగంగా భారత్‌ నుంచి తరుణ్‌తో కలిసి 20 సార్లు ప్రయాణించింది. ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. దీంతో అసలుగుట్టు బయటపడింది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)