Breaking News

కల నిజమైన వేళ.. నటి ప్రగతి పోస్ట్ వైరల్

Published on Mon, 12/01/2025 - 11:31

నటీనటులు చాలావరకు కుదిరితే సినిమాలు లేదంటే ఏవో బిజినెస్‌లు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం కాస్త భిన్నమైన దారిలో వెళ్తుంటారు. అలాంటి వారిలో నటి ప్రగతి ఒకరు. తల్లి, అక్క, పిన్ని తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గత రెండు మూడేళ్ల నుంచి మూవీస్ చేయడం చాలావరకు తగ్గించేసింది. దానికి కారణం పవర్ లిఫ్టింగ్. లాక్‌డౌన్ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ఈమె.. పవర్ లిఫ్టింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)

ఎంతలా అంటే గతేడాది జరిగిన సౌతిండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో వెండి పతకం సాధించింది. ఈ ఏడాది కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు, రెండు వెండి పతకాలు సాధించి చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకంగా భారత తరఫున త్వరలో జరగబోయే పోటీల్లో పాల్గొనబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రగతినే వెల్లడించింది. భారత జెర్సీ ధరించి, ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నెల్లూరులోని ఉలవపాడు ప్రగతి సొంతూరు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి చెన్నై వెళ్లిపోయింది. కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పడంతో కెరీర్ మొదలుపెట్టింది. తమిళ దర్శకుడు భాగ్యరాజీ 'వీట్ల విశేషంగా' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. తర్వాత ఒకటి రెండు మూవీస్‌లో హీరోయిన్‌గా కనిపించింది. అనంతరం పెళ్లి జరగడంతో కొన్నాళ్లకు నటనకు గ్యాప్ ఇచ్చింది. రీఎంట్రీలో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమె.. ఎఫ్ 2, ఎఫ్ 3, జులాయి, చిరుత, రెడీ, గంగోత్రి, నువ్వే నువ్వే, దూకుడు తదితర చిత్రాల్లో నటించింది.

(ఇదీ చదవండి: నేడు సమంత పెళ్లి? రాజ్‌ మాజీ భార్య పోస్ట్‌ వైరల్‌)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)