ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
విజయ్ గెలుపు.. బుట్టబొమ్మకు ముందే తెలుసా?
Published on Tue, 05/05/2026 - 19:51
తమిళనాట ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఎలక్షన్ ముందు అడ్డంకులు రావడంతో జన నాయగన్ వివాదం కోర్టుకు చేరింది. ఎన్నికల ముందు రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ మూవీలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
ఈ సినిమా సంగతి పక్కన పెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ.. విజయ్‌ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జన నాయగన్ మూవీ షూటింగ్ టైమ్‌లో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు.
BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx
— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026
Tags : 1