Breaking News

ఏడుస్తున్నా వినకుండా ఆ సీన్స్‌ చేయించారు.. నాపై చేతబడి చేశారు!

Published on Wed, 09/10/2025 - 13:33

చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ.. ఇలా స్టార్‌ హీరోలందరితోనూ నటించింది హీరోయిన్‌ మోహిని. ఆదిత్య 369 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు 100కి పైగా సినిమాలు చేసింది. తమిళ, మలయాళంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

వద్దని ఏడ్చా..
చాలాకాలం తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా సినీజ్ఞాపకాలను పంచుకుంది. మోహిని (Tamil Actress Mohini) మాట్లాడుతూ.. ఓ సినిమాలో దర్శకుడు రొమాంటిక్‌ సాంగ్‌ను స్విమ్మింగ్‌ పూల్‌లో ప్లాన్‌ చేశాడు. నాకసలే ఈత రాదు, అందులోనూ స్విమ్‌ సూట్‌ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అదే మాట చెప్పి ఏడ్చాను. నావల్ల కాదన్నాను.

ఇష్టం లేకుండా నటించా
అప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్‌ పూల్‌లో షూట్‌ పూర్తి చేశారు. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్‌ చేయాలన్నారు. అప్పుడు నేనసలు ఒప్పుకోలేదు. ఆల్‌రెడీ సీన్‌ అయిపోయాక మళ్లీ ఇదేంటి? నేను చేయనని తెగేసి చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్‌గా కనిపించేలా చేశారు.

చేజారిన సినిమాలు
'సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌' మూవీలో సిమ్రాన్‌కు బదులుగా నేనే నటించాల్సింది. ముందు నన్నే అడిగారు. కానీ నేను సినిమాలు మానేశానని ఎవరో డైరెక్టర్‌కు చెప్పారట! దీంతో నా స్థానంలో సిమ్రాన్‌ను తీసుకున్నారు. ఈ విషయం దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ స్వయంగా నాతో చెప్పాడు. రజనీకాంత్‌ 'ముత్తు' సినిమాలో హీరోయిన్‌గా నన్ను తీసుకోవాలా? మీనాను సెలక్ట్‌ చేసుకోవాలా? అని దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. నన్నోసారి వచ్చి కలవమన్నారు. పనికోసం వెతుక్కుంటూ వెళ్లడం నాకిష్టం లేదు. 

నాపై చేతబడి
మనకని రాసిపెట్టుంటే అది మనకే వస్తుందని ఊరుకున్నాను. వాళ్లు ఫైనల్‌గా మీనాను సెలక్ట్‌ చేశారు. ఇది పోతే నాకు ఎక్కడో మంచి అవకాశం ఉండే ఉంటుందనుకున్నాను. డేట్స్‌ కుదరకపోవడంతో చిన్న తంబి చేజారింది అని చెప్పుకొచ్చింది. పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడుతూ.. నా భర్త కజిన్‌ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని పేర్కొంది. మోహిని చివరగా కలెక్టర్‌ (2011) అనే మలయాళ మూవీలో మెరిసింది.

చదవండి: IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్‌లో రక్తం.. ప్రాణం లేని బిడ్డకు జన్మనిచ్చిన నటి

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)