మమితా బైజు కొత్త సినిమా.. నిర్మాతగా మారిన స్టార్‌ హీరో

Published on Wed, 02/11/2026 - 07:25

నటి మమితా బైజు క్రేజ్‌ ఇప్పుడు మామూలుగా లేదు. పదహారేళ్ల ప్రాయంలోనే  నటిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత ఎనిమిదేళ్లగా మలయాళం, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ సక్సెస్‌ రేట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తను నటించిన  మలయాళం చిత్రం ప్రేమలు మాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్‌ ల్లోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెబల్‌ చిత్రంతో జివీ.ప్రకాష్‌ కుమార్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రదీప్‌ రంగనాథన్‌కు జంటగా నటించిన డ్యూడ్‌ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.

తాజాగా  విజయ్‌ కథానాయకుడుగా నటించిన జననాయకన్‌ చిత్రంలోనూ మమితా బైజు కీ రోల్‌ చేశారు.  కాగా ప్రస్తుతం ధనుష్‌ సరసన నటిస్తున్న కారా  చిత్రాన్ని కూడా పూర్తి చేశారు.  అదేవిధంగా బెత్లెహేమ్‌ కుడుంబ అనే మలయాళం చిత్రంలోని నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌  తాజా చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయనకు జంటగా కాకుండా ఆయన నిర్మించనున్న చిత్రంలో మమితా బైజు నాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చాలామంది నటుల మాదిరిగానే ప్రదీప్‌ రంగనాథన్‌ కూడా నిర్మాతగా మారిపోతున్నారు. ఈ చిత్రానికి ఆయన అసోసియేట్‌ డైరెక్టర్‌ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలుతో త్వరలో వెలువడే అవకాశం ఉంది.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)