Breaking News

నా ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నా.. ఇది ఖరీదైన ప్రక్రియే కానీ

Published on Tue, 07/07/2026 - 11:33

పిల్లల్ని కనేందుకు సహజ ప్రక్రియ, ఐవీఎఫ్, సరోగసి లాంటి పద్ధతులున్నాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి 'ఎగ్ ఫ్రీజింగ్' అనేది కూడా వెలుగులోకి వచ్చింది. అంటే వయసులో ఉన్నప్పుడు మహిళలు తమ అండాల్ని భద్రపరుచుకుంటారు. తర్వాత పిల్లల్ని కనాలనే ఆలోచన వచ్చినప్పుడు వాటిని తమ శరీరంలోకి ప్రవేశపెట్టి తల్లి అవుతారు. రీసెంట్ టైంలో పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు ఇలానే చేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులోకి స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు)

'ఈ విషయాన్ని మొదటిసారి మీతో పంచుకుంటున్నాను. నా అండాల్ని భద్రపరుచుకున్నాను. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఆలోచన లేదు. పెళ్లి, పిల్లలు అనేది మనస్ఫూర్తిగా సిద్ధమైనప్పుడు మాత్రమే జరగాలి. సమాజం లేదా వయసు ఒత్తిడి వల్ల కాదు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా కాస్ట్ లీ. కానీ నేను దాన్ని భరించగలిగినందుకు అదృష్టవంతురాలిని. ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం ఉండదు'

'మిమి సినిమా కోసం బరువు పెరగాల్సి వచ్చినప్పుడు ఈ ప్రక్రియ పూర్తి చేశాను. హార్మోన్ చికిత్స వల్ల శరీరం ఉబ్బినట్లు అనిపించడం, బరువు పెరగడం లాంటివి ఉంటాయి. అప్పటికే మూవీ కోసం బరువు పెరుగుతున్నందున అదే సరైన టైం అని భావించి నా ఎగ్స్ ఫ్రీజింగ్ చేయించుకున్నాను. ఇది అంత సులభం కాదు. హార్మోన్ల మార్పుల కారణంగా మూడ్ స్వింగ్స్, శారీరక అసౌకర్యం లాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే భవిష్యత్తులో పిల్లల విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది' అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.

మహేశ్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కృతి సనన్.. తర్వాత తెలుగులో 'దోచేయ్' అని మరో మూవీ చేసింది. ప్రభాస్ 'ఆదిపురుష్'లోనూ సీతగా నటించింది. ఈమె చేసిన లేటెస్ట్ చిత్రం 'కాక్‌టెయిల్ 2' గత నెలలో రిలీజైంది. కలెక్షన్స్ వచ్చాయి గానీ మూవీ మాత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

(ఇదీ చదవండి: ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది)

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)