Breaking News

నటికి అభ్యంతరకర ప్రశ్న.. తప్పులో కాలేసిన ఖుష్బూ!

Published on Fri, 11/07/2025 - 12:48

మలయాళ నటి గౌరీకిషన్‌ (Gouri G Kishan)కు చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్‌ మూవీ అదర్స్‌. ఈ తమిళ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమెను ఓ జర్నలిస్టు అవమానకరమైన ‍ప్రశ్నతో ఇబ్బందిపెట్టాడు. మీ బరువెంత? అని అడిగాడు. అది విని షాకైన గౌరీ కిషన్‌.. నా బరువుతో మీకేం అవసరం? ఇది చాలా చెత్త ప్రశ్న.. ఇలా అడగడం బాడీ షేమింగే అవుతుంది అని మండిపడింది. అది బాడీ షేమింగ్‌ కాదని జర్నలిస్ట్‌ వాదించాడు. అలా వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

హీరోను అడగ్గలరా?
ఈ వ్యవహారంపై సీనియర్‌ నటి ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar) ఘాటుగా స్పందించింది. జర్నలిజం విలువలు కోల్పోతోంది. కొందరు జర్నలిజాన్ని తప్పుగా వాడుతున్నారు. ఒకమ్మాయి బరువు గురించి వారికెందుకు? హీరోయిన్‌ను సూటిగా అడిగినప్పుడు మరి హీరో బరువు గురించి ఎందుకు అడగలేదు? ఇది నిజంగా సిగ్గుచేటు. యువ నటి గౌరీని ఈ విషయంలో అభినందించాల్సిందే! అభ్యంతరకర ప్రశ్న అడిగిన వ్యక్తికి అక్కడే ఇచ్చిపడేసింది. 

మీ ఇంట్లోవాళ్లను అడిగితే ఓకేనా?
మేము ఎదురుతిరిగి మీ కుటుంబంలోని స్త్రీల గురించి అలాంటి చెత్త ప్రశ్నలు అడిగితే మీకు ఓకేనా? ముందు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.. గౌరవం ఇచ్చిపుచ్చుకోండి అని ట్వీట్‌ చేసింది. అయితే ఇక్కడ ఓ చిన్న పొరపాటు చేసింది. నటి గౌరీకిషన్‌ పేరుకు బదులుగా గౌరీ శంకర్‌ అని హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు, మేడమ్‌, ఆమె గౌరీ శంకర్‌ కాదు.. గౌరీ కిషన్‌ అని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

 

 

చదవండి: ప్రెస్‌మీట్‌లో ఇదేం ప్రశ్న.. ఫైర్‌ అయిన నటి

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)