Breaking News

హైదరాబాద్ పబ్‌లో తెలుగు నటి హంగామా.. వీడియో వైరల్

Published on Sat, 05/31/2025 - 16:54

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన కల్పిక గణేశ్.. తాజాగా ఓ వివాదంలో నిలిచింది. రీసెంట్‌గా తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్‌కి వెళ్లింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వహకులు, ఈమెకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని నటి కల్పిక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తనపై పబ్ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించారని కల్పిక చెబుతోంది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

అయితే గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపిస్తోంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదంలో నటిపై పబ్ సిబ్బంది దాడి చేశారని అంటున్నారు గానీ అందుకు తగ్గ ఫొటోలు, వీడియోలు ఏం బయటకు రాలేదు. దీంతో దాడి నిజంగా జరిగిందా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.

'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈమెకు పెద్దగా ఆఫర్స్ లేవు. ఇలాంటి ఈ టైంలో వివాదం ద్వారా వార్తల్లో నిలిచింది.

(ఇదీ చదవండి: నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం)

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)