Breaking News

హీరోయిన్స్‌ కంటే అందంగా కనిపిస్తున్నానని పక్కన పెడుతున్నారు: ‘యశోద’ నటి

Published on Thu, 11/24/2022 - 13:49

నటి కల్పికా గణేష్‌ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. 2009లో వచ్చిన ప్రయాణం సినిమాతో నటిగా పరిచయమైన ఆమె ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు వంటి చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి గుర్తింపు పొందింది. రీసెంట్‌గా ఆమె సమంత యశోద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అ‍యితే ఇంతకాలం సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన కల్పిక ఈ మధ్య వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నేను ఓ 30 సినిమాలు చేశాను. వాటిలో 15 చిత్రాలు  మాత్రమే విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు చేసిన తరువాత నన్ను పక్కన పెట్టడం చేశారు. ఎందుకంటే హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని, బాగా చేస్తున్నానంటున్నారు. దాంతో సినిమాలో హీరోయిన్‌ డామినేట్ చేస్తున్నాననే కారణాలుగా కనిపించాయి. నేను చంద్రశేఖర్ యేలేటి గారి స్కూల్ నుంచి వచ్చాను. కానీ అలాంటి వాతావరణం బయట ఎక్కడా  కనిపించలేదు. డైలాగ్ ఉందా అని అడిగితే ‘నీకు కాస్త యాటిట్యూడ్ ఎక్కువ’ అనేవారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు వరుస సినిమాలు చేస్తూ వెళుతుంటారు. కానీ నేను అలా కదు. నాకు పాత్ర, కథ నచ్చితేనే చేస్తాను. బహుషా నేను తక్కువ సినిమాలు చేయడానికి ఇదే కారణం అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

చదవండి: 
ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్‌, ఫొటోలు వైరల్‌
బిజినెస్‌ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)