Breaking News

రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్

Published on Wed, 06/18/2025 - 11:08

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజోల్.. హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదో భయంకరమైన ప్రదేశమని, జీవితంలో మళ్లీ అ‍క్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: కారులో విజయ్-రష్మిక జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?)

హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్.. ప్రస్తుతం 'మా' అనే సినిమా చేసింది. జూన్ 20న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ అత్యంత భయానక ప్రదేశం అని చెప్పుకొచ్చింది. 'ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది' అని కాజోల్ చెప్పింది.

మరి కాజోల్‌ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కాజోల్ కెరీర్ విషయానికొస్తే.. 1992 నుంచి సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒకటైన 'దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే' సినిమాలో హీరోయిన్ ఈమె. తర్వాత కూడా పలువురు స్టార్స్‌తో మూవీస్ చేసింది. కొన్నాళ్లకు హీరో అజయ్ దేవగణ్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో సలాం వెంకీ, లస్ట్ స్టోరీస్ 2, దో పత్తి తదితర చిత్రాలతో కాజోల్ ఆకట్టుకుంది. ఇప్పుడు 'మా' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు