Breaking News

మా అధ్యక్షుడి అక్కకే ఇలాంటి గతి.. అయినా స్పందించవా?: హేమ

Published on Sun, 09/21/2025 - 11:02

టాలీవుడ్‌ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) డ్రెస్సింగ్‌పై ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రశ్నించిన తీరు వివాదాస్పదమైంది. తాను వేసుకునే బట్టలు, వయసు గురించి ‍ప్రశ్నిస్తూ బాడీ షేమింగ్‌ చేశాడని, అవమానించాడంటూ మంచు లక్ష్మి ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించింది. తన ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రశ్నించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.

చదువురాని వాళ్లంటే ఏదో అనుకోవచ్చు
ఈ విషయంలో సీనియర్‌ నటి హేమ (Actress Hema).. మంచు లక్ష్మికి సపోర్ట్‌ చేసింది. మీడియా వల్ల బాధపడ్డవారిలో నేనూ ఒకర్ని. పెద్దగా చదువుకోని నాలాంటివాళ్లు ఏదైనా తెలియక మాట్లాడి ఉండొచ్చేమో! కానీ బాగా చదువుకున్న కొందరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఇలా ఏదిపడితే అది మాట్లాడినప్పుడు మీ అసోసియేషన్‌లో ఉన్న వేరే ఎవరూ మాట్లాడరా?

మా అధ్యక్షుడి అక్కకే ఇలాంటి గతి
నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? మంచు లక్ష్మిని ఓ యాంకర్‌ బాడీ షేమింగ్‌ చేశాడు. మా అసోసియేషన్‌ ఏం చేస్తోంది? మా ప్రెసిడెంట్‌ అక్కకే ఇలాంటి గతి అంటే.. మిగతావాళ్ల పరిస్థితి ఏంటి? ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఎందుకింతవరకు స్పందించలేదు? విష్ణుబాబు, ఏం చేస్తున్నావ్‌. ఈరోజు నీ అక్కకు, రేపు ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి వస్తుంది. మూవీ ఆర్టిస్ట్‌ అసిసోయేషన్‌ అన్నది మాలాంటి ఆర్టిస్టులను కాపాడుకోవడానికే కదా! 

సారీ చెప్పించారు
గతంలో వేణుస్వామి.. సమంత, నాగచైతన్య గురించి ఏదో అంటే జర్నలిస్టులు కంప్లైంట్‌ చేసి ఆయన క్షమాపణలు చెప్పేదాకా ఊరుకోలేదు. తర్వాత సుమతో కూడా సారీ చెప్పించారు. మరిప్పుడు ఆ వ్యక్తి పిచ్చి ప్రశ్నలతో నటిని అవమానించినప్పుడు మా అసోసియేషన్‌ పట్టించుకోదా? దయచేసి స్పందించు విష్ణు బాబు' అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది.

చదవండి: హీరోయిన్లు అంటే చాలు, రెడీగా ఉంటారు: వేదిక

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)