Breaking News

ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ

Published on Mon, 07/08/2024 - 12:08

బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ దగ్గర్లో ఉన్న జీఆర్‌ ఫాంహౌస్‌లో మే 19న రాత్రి జరిగిన ఒక రేవ్‌ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు. అక్కడ హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయిని పరప్పన అగ్రహార జైలుకు ఆమెను తరలించడం ఆపై బెయిల్‌ ద్వారా విడుదల కావడం జరిగింది. కానీ, తాను ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదని ఆమె పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. ఈ వివాదం వల్ల ఆమెను మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు  మంచు విష్ణు ప్రకటించారు. తాజాగా హేమ ఒక సుదీర్ఘమైన లేఖను రాసి మంచు విష్ణుతో పాటు మా వ్యవస్థాపకులు మెగాస్టార్‌ చిరంజీవికి పంపారు.

'సుమారు పదేళ్ల పాటు నేను మా సభ్యురాలిగా ఉన్నాను. చిత్రపరిశ్రమలో 'మా' ఒక అమ్మలా నన్ను రక్షిస్తుందని కోరుకుంటున్నాను. దాదాపు నెల రోజుల క్రితం ఒక రేవ్‌ పార్టీలో పాల్గొన్నాను. అందులో నేను ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదు. మీడియా దుష్ప్రచారం చేయడం వల్ల ఇదంతా జరిగింది. దీంతో నా కుటుంబసభ్యులకు తీవ్రమైన వేదన మిగిలింది. అనంతరం నన్ను మా సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ నిర్ణయం నాలో అంతులేని ఆవేదనను కలిగించింది. 'మా' బైలాస్‌ ప్రకారం నాకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలి. నా నుంచి వివరణ తీసుకోవాలి. నేను ఇచ్చిన వివరణలో లోపాలు ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి. నాపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కోర్టు కూడా నేను తప్పు చేసినట్లు ప్రకటించలేదు. మీడియా మాత్రమే నన్ను దోషిగా చూపించేందుకు ప్రయత్నం చేసింది. ఈ పరిణామాలు నా వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత జీవితాన్ని హాననం చేసింది.

నాకు సంబంధం లేని విషయాలను నాకు అంటగట్టి నన్ను విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. మీడియా ఒత్తిడికి లోబడి నన్ను సస్పెండ్ చేయడం నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న ఈ సమయంలో నాకు మా అండగా ఉండాలి. నా సస్పెన్షన్ ను వెంటనే ఎత్తి వేస్తారు అని ఆశిస్తున్నాను.' అని హేమ ఒక లేఖ రాశారు. తనకు సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్స్‌ను కూడా ఆమె జతచేశారు. ఈ లేఖ విషయంలో మా అధ్యక్షడు మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు