పాడుబడ్డ ఇంట్లో అనాథగా చిన్నారి.. కాపాడిన హీరోయిన్‌ సోదరి

Published on Sun, 04/20/2025 - 17:26

బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటానీ (Disha Patani) సోదరి ఖుష్బూ (Khushboo Patani) ఆర్మీలో మేజర్‌గా సేవలందించారు. 12 ఏళ్లపాటు దేశానికి సేవ చేసిన ఆమె రెండేళ్ల క్రితం స్వచ్ఛందంగా రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫిట్‌నెస్‌ కోచ్‌గా పని చేస్తున్నారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన వీడియో జనాల హృదయాలను కదిలిస్తోంది.

పాడుబడ్డ ఇంట్లో చిన్నారి
ఉత్తరప్రదేశ్‌ బరేలీలో నివసిస్తున్న ఖుష్బూ.. ఆదివారం ఉదయం అలా బయటకు నడుచుకుంటూ వెళ్లారు. పాడుబడ్డ ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించడంతో లోనికి వెళ్లి చూడగా అక్కడ ఓ చిన్నారి కనిపించింది. నేలపై ఒళ్లంతా మట్టితో ఉన్న ఆ చిన్నారిని చూడగానే ఖుష్బూ మనసు తరుక్కుపోయింది. పసిపాపను ఇలా అనాథను చేసి వదిలేశారేంటని ఆమె బాధపడ్డారు. 

మీరేం తల్లిదండ్రులు?
ఆ పాపాయిని జాగ్రత్తగా తన ఒడిలోకి తీసుకున్నారు. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుంటే ఆమెను లాలించారు. చివర్లో పాప ముఖాన్ని దగ్గరి నుంచి చూపిస్తూ.. ఈ చిన్నారి గురించి తెలిసినవారు తనను సంప్రదించమని కోరారు. ఈ పసిపాపను పాడుబడ్డ ఇంట్లో వదిలేసిన తల్లిదండ్రులపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం తల్లిదండ్రులు? పాప భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసినందుకు సిగ్గుపడండి అని మండిపడ్డారు.

ఇంకా ఎన్నాళ్లీ దారుణాలు..
'దేవుడే రక్షణగా నిలబడే వ్యక్తికి ఎవరూ హాని తలపెట్టలేరు. ఈ చిన్నారిని అధికారులకు అప్పగించాం. తను మంచి చేతుల్లోకి వెళ్లేలా చూసుకుంటాను. కచ్చితంగా తన భవిష్యత్తు బాగుంటుంది. మన దేశంలో ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాయి? దయచేసి ఆడపిల్లల్ని కాపాడండి' అని ఖుష్బూ కోరారు.

ప్రభాస్‌తో నటించిన దిశా..
ఖుష్బూ చెల్లెలు దిశా పటానీ విషయానికి వస్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన ఈ బ్యూటీ 'లోఫర్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. గతేడాది వచ్చిన ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' మూవీలోనూ యాక్ట్‌ చేసింది. ఎక్కువగా హిందీ సినిమాలే చేసింది. 'ఎంఎస్‌ ధోని: ద అన్‌టోల్డ్‌ స్టోరీ', 'భాగీ 2', 'భరత్‌', 'మలంగ్‌', 'రాధే', 'ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌', 'యోధ' సినిమాలతో పాపులర్‌ అయింది. ప్రస్తుతం 'వెల్‌కమ్‌ టు ద జంగిల్‌' మూవీలో నటిస్తోంది.

 

 

చదవండి: నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)