Breaking News

కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

Published on Tue, 09/26/2023 - 15:42

కలర్స్ స్వాతి తెలుగువారికి పరిచయం ‍అక్కర్లేని పేరు. డేంజర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫేమస్ అయింది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. తాజాగా మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో త్రిపురలో కలిసి నటించిన నవీన్ చంద్రతో మరోసారి కనిపించనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానాలిచ్చింది. 

(ఇది చదవండి: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే..)

ఈవెంట్‌లో పాల్గొన్న కలర్స్‌ స్వాతికి ఆసక్తికర ప్రశ్నలు వేశారు. మీపై ఇటీవల డైవర్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి కదా.. వీటిపై మీ సమాధానమేంటి అని అడిగారు. అయితే దీనికి స్వాతి సైతం అదే రీతిలో స్పందించింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటి వాటికి నేను సమాధానం కూడా ఇవ్వను అంటూ తెగేసి చెప్పింది. 

స్వాతి మాట్లాడుతూ..' నేను కలర్స్ ప్రోగ్రామ్‌లో చేస్తున్నప్పుడు నా వయసు కేవలం పదహారేళ్లు. అప్పట్లో అయితే సోషల్ మీడియా కూడా లేదు. నన్ను నేను ఎలా ప్రజెంట్‌ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అప్పుడు కనుక సోషల్ మీడియా ఉండి ఉంటే నన్ను ఫుట్‌ బాల్ ఆడేసేవారేమో అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడేలా హ్యాండిల్ చేస్తున్నారే తెలియదు. ఒక యాక్టర్‌గా నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. అందుకే ఈ విషయం గురించి నేను చెప్పను.' ‍అని అన్నారు. కాగా.. ప్రస్తుతం కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

(ఇది చదవండి: 40 ఏళ్లలో సంపాదించిన ఆస్తి, నగలు.. అన్నీ పోగొట్టుకున్నా: నటి)

Videos

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)