Breaking News

సాహసం చేసిన టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్

Published on Wed, 05/14/2025 - 08:45

ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్ పాపులర్ అవుతూ ఉంటుంది. అలా గత కొన్నాళ్లలో చూసుకుంటే భాగ్యశ్రీ బోర్సే పేరు గట్టిగా వినిపిస్తుంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్ అయింది గానీ వరస అవకాశాలు ఈమెని వరించాయి.

ప్రస్తుతం తెలుగులో రామ్ కొత్త సినిమాలో, అలానే దుల్కర్ సల్మాన్ 'కాంత'లో భాగ్యశ్రీనే హీరోయిన్. మరోవైపు ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబోలో రాబోయే మూవీలోనూ ఈమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె ఇప్పుడు ఓ సాహసం చేసింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా)  

'వన్ లైఫ్, వన్ బ్రీత్, వన్ జంప్' అని భాగ్యశ్రీ.. దుబాయిలో స్కై డైవింగ్ చేసింది. ఇందులో భాగంగా విమానంలో ఆకాశంలో చాలా ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి దూకేస్తారు. చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తున్నప్పటికీ.. ధైర్యం కావాలి. ఇప్పుడు ఈ అడ్వెంచర్ చేసి తన చిన్న చిన్న కోరికలని భాగ్యశ్రీ నెరవేర్చుకుంటోంది.

మరోవైపు భాగ్య శ్రీ.. తెలుగు హీరో రామ్ తో డేటింగ్ లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత కలిసి ఓ సినిమా చేస్తున్న వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అంటున్నారు. ‍అయితే ఇది నిజమా? మూవీ పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంటా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సినిమాలతోనే కాదు సాహసాలు చేస్తూ కూడా ట్రెండింగ్ లో ఉంటోందిగా.

(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు)  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)