Breaking News

సీఎంగా విజయ్.. తమిళ హీరోలు ఇలా బయటపడుతున్నారేంటి?

Published on Tue, 07/28/2026 - 18:21

రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నటీనటులు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, విజయ్ లాంటి వాళ్లు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు. అయితే హీరో విజయ్.. తమిళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈయన కొన్ని సీట్లు గెలిస్తే గొప్ప అనుకున్నారు. కానీ సీఎం అయ్యేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఈయనకు అధికారం రావడం మాటేమో గానీ తమిళ హీరోలు ఒకరి తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని బయటపెడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి విశాల్ చేరిపోయాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)

రీసెంట్ టైంలో కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ తనకున్న రాజకీయ ఆసక్తిని బయటపెట్టేలా మాట్లాడగా.. హీరో ధనుష్ ఏకంగా పెద్ద సభని ఏర్పాటు చేశాడు. తాజాగా విశాల్ కూడా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తాను సొంతం చేసుకున్న మంచి పేరును ప్రజా సేవకు ఉపయోగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా. మీరు చూపిన అభిమానానికి.. మీకు తిరిగి ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నా. ఇకపై నా ప్రయాణం సాధారణంగా ఉండదు. ఎలాంటి అడ్డదారులు లేకుండా నేరుగా, నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నా. ఆ మార్గంలో ప్రయాణిస్తూ అన్ని రంగాల్లో మీకు అండగా ఉంటానని విశాల్ అన్నాడు. దీంతో ఈ హీరో కూడా త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఇస్తారని మాట్లాడుకుంటున్నారు.

‍అయితే విజయ్‌కి కలిసొచ్చినట్లు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మిగతా తమిళ హీరోలకు పరిస్థితులు కలిసొస్తాయా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. ధనుష్, విశాల్ లాంటి హీరోలకు ఉన్న అభిమాన గణం వేరు. చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లోకి చాలామంది హీరోలు వచ్చేలా కనిపిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: రామ్ చరణ్‌కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)