Breaking News

పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!

Published on Thu, 08/17/2023 - 15:24

మెగా ఫ్యామిలీలో ఈ నెలలోనే పెళ్లి బాజాలు మోగాల్సింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి.. ఆగస్టు 24న ఏడడుగులు వేస్తారని కొన్నరోజుల ముందు వినిపించింది. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని తేలిపోయింది. ఎందుకంటే ఒకవేళ పెళ్లి ఉంటే ఈ పాటికే శుభలేఖలు పంచడం, ముందస్తు కార్యక్రమాలు జరిగేవి. కానీ అలాంటివేం జరగట్లేదు. మరోవైపు వరుణ్ కొత్త మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు.

'గాండీవధారి అర్జున' పేరుతో తీసిన ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలోకి రానుంది. ఫుల్ ఆన్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇందులో వరుణ్ తేజ్ స్పై (గూఢచారి) పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్‌కి తన లవ్ స్టోరీ, పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే వాటికి సమాధానమిచ్చేశాడు.

(ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండకు కాబోయే భార్యపై సమంత కామెంట్స్‌)

'లావణ్యతో నా లవ్‌స్టోరీ మొదలై ఐదేళ్లు దాటిపోయింది. చాలాకాలం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. అలా ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో మరో అడుగు ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో లావణ్య ఒకరు. ఫస్ట్ నేనే ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాను. మా ప్రేమ గురించి ఇంట్లో చెబితే వాళ్లు ఒప్పుకొన్నారు'

'లావణ్య.. ఇప్పటికే నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చింది. ప్రస్తుతం నేను వాడుతున్న ఫోన్ అలాంటి గిఫ్టే. నాకు ఏది ఇష్టమనేది లావణ్యకి బాగా తెలుసు. ఆమె చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. కేరింగ్ పర్సన్ కూడా. నా పర్సనల్ విషయాలు ఎప్పుడూ సీక్రెట్‌గా ఉంచడానికి ఇష్టపడతాను. అందుకే ప్రేమ గురించి బయటపెట్టలేదు. ఎంగేజ్‌మెంట్‌లానే పెళ్లి కూడా సింపుల్‌గా చేసుకుంటాం' అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో వరుణ్-లావణ్య పెళ్లి ఉండొచ్చని అంటున్నారు. అలానే వీళ్లిద్దరూ తొలిసారి కలిసి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారనే టాక్ కూడా వినబడింది. బహుశా ఇదే నిజమై ఉండొచ్చు. అయితే ఈ విషయాలన్నింటిపై మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్‌ కామెంట్స్‌)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)