Breaking News

డ్రగ్స్‌ కేసులో హీరో శ్రీరామ్‌ అరెస్ట్‌

Published on Mon, 06/23/2025 - 15:38

చెన్నై: డ్రగ్స్‌ కేసులో సినీ హీరో శ్రీరామ్‌ (Sriram) అలియాస్‌ శ్రీకాంత్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. AIADMK మాజీ నేత నుంచి శ్రీరామ్‌ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. నటుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగింది?
చెన్నైలోని ఓ బార్‌లో ఏఐఏడీఎమ్‌కే మాజీ నేత ప్రసాద్‌ తాగి గొడవకు దిగాడు. పోలీసులు అతడిచి అరెస్టు చేసి విచారించగా డ్రగ్స్‌ వ్యవహారం బయటపడింది. హీరో శ్రీరామ్‌ కోసం ప్రదీప్‌ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్‌ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్‌కు 40 సార్లు డ్రగ్స్‌ అమ్మినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్‌ వాడినట్లు తేలిందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై హీరో శ్రీరామ్‌ స్పందించాల్సి ఉంది.

శ్రీరామ్‌ సినీజర్నీ..
శ్రీరామ్‌.. రోజా కూటం అనే తమిళ చిత్రంతో హీరోగా ప్రయాణం ప్రారంభించాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్‌ పోలీస్‌, దడ, నిప్పు, లై, 10th క్లాస్‌ డైరీస్‌,స్నేహితులు(డబ్బింగ్‌ మూవీ), పిండం, రావణాసుర.. ఇలా అనేక సినిమాలు చేశాడు.

 

చదవండి: ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)