Breaking News

నేను తెలుగోడినే.. టాలీవుడ్ పట్టించుకోలేదు

Published on Sat, 07/04/2026 - 19:10

మిగతా భాషల సంగతేమో గానీ తెలుగులో మాత్రం ప్రతి సినిమాలోనూ పరభాష నటీనటులు చాలామంది ఉంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పుట్టినప్పటికీ ఇతర ఇండస్ట్రీలోనూ సెటిలైన నటీనటులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకడు శ్రీమన్. తమిళ డబ్బింగ్ చిత్రాలతో ఈయన్ని చూసే ఉంటారు. అయితే తాను కూడా తెలుగువాడినే అని.. అనిల్ రావిపూడి మూవీలో తనకు అవకాశమివ్వడంపై ఎమోషనల్ అయ్యాడు. ఓ వీడియోని పోస్ట్ చేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)

'నేను తమిళ సినిమాలకే పరిమితమైన నటుడిని అనుకుంటే పొరపాటే. నా పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్. మాది తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లలమామిడాడ గ్రామం. చాలా ఏళ్ల క్రితమే మా కుటుంబం తమిళనాడులో స్థిరపడటం వల్ల తమిళంలో ఎక్కువ అవకాశాలొచ్చాయి. కానీ నేను పుట్టి పెరిగిన తెలుగులో నాకంటూ ఆశించిన స్థాయిలో గుర్తింపు, పేరు రాకపోవడం నాకు ఎప్పుడూ పెద్ద లోటుగానే ఉండిపోయింది'

'ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్‌లో నన్ను చూసి తెలుగు ప్రేక్షకులు ఎంతో అప్యాయంగా పలకరిస్తుంటారు. నా యాక్టింగ్ బాగుందని మెచ్చుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉన్నా చివరలో 'మీ పేరేంటి సార్?' ‍అని అడిగినప్పుడు మాత్రం బాధగా ఉంటుంది. వందలాది సినిమాల్లో కనిపించినా గానీ తెలుగు ప్రేక్షకులకు నా పేరు తెలియకపోవడం బాధాకరం. తమిళ చిత్రాలు తెలుగులో రిలీజ్ చేసినప్పుడు నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకొంటాను. కానీ నేరుగా తెలుగు మూవీలో నటించి చాలా ఏళ్లు అయిపోయింది. మంచి తెలుగు దర్శకులతో పనిచేయాలనే ఆశ ఉన్నా ఎవరినీ నోరు తెరిచి ఛాన్సులు అడగలేకపోయాను'

'2022లో వారిసు(తెలుగు 'వారసుడు') షూటింగ్ టైంలో నిర్మాత దిల్ రాజు ద్వారా అనిల్ రావిపూడి నాకు పరిచమయ్యారు. నేను చేసిన సినిమాలు, హావభావాలు గుర్తుపెట్టుకున్న అనిల్.. ఇన్నాళ్లకు తన మూవీలో ఆఫర్ ఇచ్చాడు. ఈ చిత్రం కోసం తమిళంలో నాలుగు ప్రాజెక్టులు వదులుకున్నాను. ఇందులో నటించడం మర్చిపోలేని అనుభూతి కలిగిస్తోంది. ఈ ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడికి ఎన్నో వేల కృతజ్ఞతలు చెప్పుకొన్నా తక్కువే' అని శ్రీమన్ భావోద్వేగానికి గురయ్యాడు.

వెంకటేశ్-కల్యాణ్ రామ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెట్‌లో శ్రీమన్.. దర్శకుడు అనిల్ రావిపూడితో తీసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ నటుడు.. కమల్ హాసన్ 'పంచతంత్రం', 'కాంచన' ఫ్రాంచైజీతో పాటు గిల్లి, భైరవ తదితర చిత్రాల్లో కనిపించాడు.

(ఇదీ చదవండి: వాళ్లు పెద్దోళ్లు.. ఖుష్బూపై అలిగిన సీనియర్ నటుడు)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)