Breaking News

గాంధీపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన నటుడు శ్రీకాంత్

Published on Sun, 10/12/2025 - 16:43

గత వారం రోజులుగా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ వార్తల్లో ఉంటూ వచ్చాడు. మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన ఇతడు.. తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. గాంధీ మహాత్ముడేమీ కాదని, భారత దేశానికి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌ లాంటి వారి వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీని తర్వాత మరో వీడియోలో వర్ణించడానికి వీల్లేని విధంగా కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) 

అయితే శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. అలానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇతడు నటించిన 'అరి' సినిమా ప్రదర్శనని అడ్డుకున్నారు. థియేటర్ బయట శ్రీకాంత్ దిష్టిబొమ్మని కూడా పలువురు వ్యక్తులు దహనం చేశారు. ఆదివారం.. మా అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. శ్రీకాంత్ తీరు గురించి ఫిర్యాదు చేశారు.

దీంతో ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలుగులో నోటికొచ్చినట్లు మాట్లాడిన ఇతడు.. ఇప్పుడేమో ఇంగ్లీష్‌లో క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలానే మూవీ రివ్యూయర్‌లపై దారుణమైన కామెంట్స్ చేశాడు. నటుడిగా ఇతడు బాగా చేస్తుండొచ్చు గానీ అప్పుడప్పుడు ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)