తీహార్‌ జైల్లో 4 నెలలు.. చావు కోసం ఎదురుచూశా: నటి

Published on Sun, 03/01/2026 - 08:18

మనీలాండరింగ్‌ కేసులో నాలుగు నెలలపాటు తీహార్‌ జైలులో శిక్ష అనుభవించింది నటి, ఇన్‌ఫ్లుయెన్సర్‌ సందీప విర్క్‌. తాజాగా తన జైలు జీవితం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. సందీప మాట్లాడుతూ.. నా శత్రువు కూడా అలాంటి ప్రదేశంలో ఉండకూడదని కోరుకుంటున్నాను. తొలిసారి తీహార్‌ జైలులో అడుగుపెట్టినప్పుడు దేవుడెందుకింత శిక్ష విధించాడని ఎంతో బాధపడ్డాను. 

ఏ జన్మలో ఏ పాపం చేశానో..
అక్కడి వాతావరణం కూడా భయానకంగా ఉంది. గత జన్మలో తెలిసో తెలియకో ఏదో పాపం చేసుంటాను, ఆ కర్మ నన్ను ఇలా వెంటాడుతోందని భావించాను. దేవుడా, నన్ను త్వరగా తీసుకెళ్లు అని ఎన్నోసార్లు వేడుకున్నాను. జైల్లో ఉన్నప్పుడు పేరెంట్స్‌ వచ్చి మనల్ని కలుస్తుంటే మరింత బాధేసేది. నా వల్ల  వారు జైలుకు రావాల్సి వచ్చినందుకు క్షమాపణలు చెప్పాను. కానీ నేనేంటో తెలిసిన నా పేరెంట్స్‌, కుటుంబం నాకు అండగా నిలబడ్డారు.

కన్నీళ్లు ఆగవు
తీహార్‌ జైల్లో ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పటికీ ఆ జైలు జీవితం గుర్తొస్తుంటే కన్నీళ్లు ఆగవు. వాష్‌రూమ్స్‌ ఎంతో మురికిగా ఉంటాయి. నేలపై పడుకోవాలి. తిండి దారుణంగా ఉంటుంది. నాలుగు రోటీలు, అన్నం, పప్పు.. రోజూ ఇదే ఉంటుంది. ఏమీ తినాలనిపించదు. కొందరు పోలీసులు జాలి చూపిస్తారు. మరికొందరు వారి ఫ్రస్టేషన్‌, కోపాన్నంతా ఖైదీలపై చూపిస్తారు. 

ఇద్దరు మహిళలకు సాయం
కానీ జైల్లో డబ్బు లేకుండా ఏ పనీ జరగదు. పైసా లేదం,న టే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. ఒక మహిళ రూ.3000 దొంగతనం చేసిన కేసులో నాలుగునెలలుగా జైల్లో ఉంటోంది. తనకు అంధురాలైన తల్లి ఉంది, తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. నేను బయటకు వచ్చాక తనకు సాయం చేస్తానని మాటిచ్చాను, ఆ మాట నిలబెట్టుకున్నాను. మరో మహిళ.. భర్త చేసిన ఆర్థిక మోసానికిగానూ ఆరునెలలుగా శిక్ష అనుభవిస్తోంది. తనకు కూడా మధ్యంతర బెయిల్‌ వచ్చేందుకు సహకరించాను అని చెప్పుకొచ్చింది.

చదవండి: లక్కీ మూవీ.. ఓటీటీ రివ్యూ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)