Breaking News

బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: 'ఇంద్ర' నటుడి ఆగ్రహం

Published on Sat, 08/23/2025 - 10:47

సోషల్‌ మీడియాను మంచికన్నా చెడుకే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న నటులు చనిపోయారంటూ ఫేక్‌ వదంతులు సృష్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు రజా మురద్‌ (Actor Raza Murad) గురించి ఇటువంటి ఫేక్‌ ప్రచారం చేపట్టారు. యాక్టర్‌ చనిపోయాడని ప్రకటిస్తూ నివాళులు అర్పించారు. సదరు పోస్ట్‌పై రజా మురద్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు తాను బతికున్నానని నిరూపించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అసత్య ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సీరియస్‌ మ్యాటర్‌
రజా మురద్‌ మాట్లాడుతూ.. నేను ఇంకా బతికున్నందుకు కొందరు చాలా బాధపడుతున్నారు. కారణమేంటో నాకర్థం కావట్లేదు. ఏకంగా నేను చనిపోయానంటూ సోషల్‌ మీడియాలో నివాళులు అర్పించారు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు పనిచేశానని, కానీ నన్ను స్మరించుకోవడానికి కూడా ఎవరూ లేరని రాశారు. నా పుట్టినరోజు, అలాగే ఫేక్‌ డెత్‌ డెట్‌ కూడా ఆ పోస్ట్‌లో జత చేశారు. ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. చాలా సీరియస్‌.

చెప్పీచెప్పీ గొంతెండిపోయింది
నేను బతికే ఉన్నానని చెప్పీచెప్పీ నా గొంతు, నాలుక, పెదాలు తడారిపోయాయి. చనిపోయానన్న వార్త అంతటా వైరలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి నాకు ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి వదంతి సృష్టించినవారిది వక్రబుద్ధి అయి ఉండాలి. జీవితంలో ఏదీ సాధించడం చేతకాక ఇలాంటి నీచపు పనులు చేసి ఆనందిస్తున్నాడు. కొంచెమైనా సిగ్గుండాలి! పోలీసులు ఆ దుర్మార్గుడిని పట్టుకుంటానని హామీ ఇచ్చారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇక చాలు
బతికుండగా ఎవరినీ చంపొద్దు.. ఇలాంటివి ఇకనైనా ఆపేయండి. నాగురించి మాత్రమే చెప్పడం లేదు. చాలామంది సెలబ్రిటీలను ఇలాగే సోషల్‌ మీడియాలో చంపేస్తున్నారు. అది పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. రజా మురద్‌.. జోధా అక్బర్‌, గోలియాకీ రాస్‌లీల రామ్‌లీల, బాజీరావు మస్తానీ, పద్మావత్‌ వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో.. ఇంద్ర, జానీ, సుభాస్‌ చంద్రబోస్‌, రుద్రమదేవి చిత్రాల్లో నటించాడు. బుల్లితెరపై మేఘ బర్సేంగె సీరియల్‌లో నటించాడు.

చదవండి: ఎమోషనల్‌ స్టోరీ మామన్‌ మూవీ రివ్యూ

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)