Breaking News

ఆమె నాకు దేవుడిచ్చిన వరం.. భార్యను వదిలేసి ప్రియురాలిపై ప్రశంసలు!

Published on Wed, 08/27/2025 - 17:15

ఓపక్క భార్యకు విడాకులు.. మరోపక్క సింగర్‌తో రిలేషన్‌ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు తమిళ హీరో రవి మోహన్‌ అలియాస్‌ జయం రవి (Ravi Mohan). ఇతడు ఆర్తి రవిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత దంపతులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ విడాకులకు మూడో వ్యక్తికే కారణమని సంచలన ఆరోపణలు చేసింది ఆర్తి. ఆ మూడో వ్యక్తి మరెవరో కాదు, సింగర్‌ కెనీషా అంటూ ప్రచారం జరిగింది.

పార్ట్‌నర్‌షిప్‌
గుడికి వెళ్లినా, బయట పార్టీకి వెళ్లినా రవి, కెనీషా (Kenishaa Francis) జంటగా కనిపిస్తూ ఉండటంతో వీరిమధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందని బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఆమెపై తనకున్న ప్రేమను పరోక్షంగా చెప్పకనే చెప్పాడు రవి. తన సొంత బ్యానర్‌ రవి మోహన్‌ స్టూడియోస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెనీషాతో కలిసి వచ్చాడు. అంతే కాదు, తన బ్యానర్‌లో ఆమెను పార్ట్‌నర్‌గా ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఏకైక కారకురాలు కెనీషా! నా జీవితంలో తనలా ఇంతవరకు ఎవరూ సాయం చేయలేదు. 

కెనీషా ఎమోషనల్‌
జీవితంలో ఏమీ తోచని స్థితిలో చిక్కుకున్నప్పుడు భగవంతుడు మనకు ఏదో రకంగా సాయం చేస్తాడు. అలా నాకు ఆ దేవుడు పంపిన బహుమతి కెనీషా. నేనెవరు?అనేది నాకు తెలిసేలా చేసింది. రవి మోహన్‌ స్టూడియోలో కెనీషాకి కూడా భాగముంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకరుండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నాడు. అతడి స్పీచ్‌ వింటున్నప్పుడు కెనీషా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది చూసిన జనాలు.. మీరు ప్రేమలో ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: టాప్‌ 15లో తనే చెత్త కంటెస్టెంట్‌.. దమ్మున్న శ్రీజకు సూపర్‌ పవర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)