Breaking News

రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం

Published on Fri, 02/14/2025 - 11:51

ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషాద వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎ‍ప్పటికీ నాలో బతికే ఉంటాయి నాన్న అంటూ రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు  రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని  రాహుల్ రవీంద్రన్‌కు అండగా నిలుస్తున్నారు.

ఈ విషాద సమయంలో తాను దర్శకత్వం వహించిన చి.ల.సౌ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. 'చి లా సౌ చిత్రానికి నేను ఓ లైన్‌ రాశాను..అది ఇప్పుడు చాలా భిన్నంగా అనిపిస్తోంది.. నాన్న ఉన్నారులే.. ‍అన్ని చూస్కుంటారు.. అనే మాటకి విలువ నాన్నను కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది'.. నాకు ఈరోజు అర్థమైంది. నాన్న లేని లోటు ఎ‍ప్పటికీ పూడ్చలేనిది.. మాటల్లో వివరించలేని భావాలను మనకు అందిస్తుంది.. థ్యాంక్యూ నాన్న.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా' అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

కాగా..నటుడిగా మాత్రమే కాదు డైరెక్టర్‌గా రాహుల్ రవీంద్రన్ పలు చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో పలు సినిమాల్లోనూ నటించారు. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను రాహుల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్మయి సైతం తెలుగులో పలు సూపర్ హిట‍్ సినిమాలకు పనిచేశారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)