Breaking News

నరేష్‌-పవిత్రా లోకేశ్‌ల పెళ్లిలో ఊహించని ట్విస్ట్‌! కనిపెట్టేసిన నెటిజన్లు

Published on Fri, 03/10/2023 - 12:17

సినీ నటులు నరేష్‌- పవిత్రా లోకేశ్‌ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మూడుముళ్లు, ఏడడుగులు వేసి తమ బంధాన్ని పదిలం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియోను స్వయంగా నరేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్‌ రాసుకొచ్చారు. అయితే వీరి పెళ్లి ఎక్కడ జరిగిందనేది స్పష్టత లేదు.

నరేష్‌కు ఇదివరకే మూడుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో ఇది నాలుగోది. అటు పవిత్రా లోకేశ్‌కు సైతం ఇది మూడో పెళ్లి. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. ఇది నిజంగా జరిగిన పెళ్లేనా? లేదా ఏదైనా సినిమా ప్రమోషన్‌ కోసం రూపొందించిన వీడియో అన్నదానిపై క్లారిటీ లేదు. గతంలోనూ నరేష్‌ న్యూఇయర్‌ సందర్భంగా పవిత్రా లోకేశ్‌కు లిప్‌లాక్‌ ఇస్తూ..కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం.. మీ ఆశిస్సులు కావాలి అంటూ వీడియో రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

కట్‌ చేస్తే అది సినిమా కోసం చేసిన వీడియో. ఇప్పుడు కూడా నరేష్‌-పవిత్రా లోకేశ్‌లు రిలీజ్‌ చేసిన వీడియోలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం అంటూ వీడియోను రిలీజ్‌ చేశారు కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో వారి కుటుంబసభ్యులు ఎవరూ కనిపించడం లేదు. వాళ్లెవరో క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారు.

మరోవైపు.. సూపర్‌స్టార్‌ కృష్ణ మరణించి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి మరణించి కనీసం ఆరు నెలలు కూడా గడవకుండా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరిపించరు. వీటన్నింటిని బేరీజు వేసుకుంటే నరేష్‌-పవిత్రాలది కేవలం రీల్‌ పెళ్లిగా  పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)