Breaking News

బాలీవుడ్‌ నటికి చేదు అనుభవం.. క్యాబ్‌ డ్రైవర్ ఎంత పని చేశాడంటే?

Published on Sun, 10/16/2022 - 18:15

ముంబైలో బాలీవుడ్ నటితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ క్యాబ్ డ్రైవర్.  ఇంటికి వెళ్లేందుకు శనివారం రాత్రి 8.15 గంటలకు నటి మానవ నాయక్ క్యాబ్‌ బుక్ చేసుకుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో క్యాబ్ ఎక్కిన నటి క్యాబ్ డ్రైవర్‌ను ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని వారించింది. అయినా వినకుండా అలాగే ముందుకెళ్లాడు. అతన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించారు.

ఆ తర్వాత కారును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లమని నటి చెప్పడంతో వినకుండా మరింత వేగంతో ముందుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక చీకటి ప్రదేశంలో కారు నిలిపాడు. దీంతో ఆమె ఆందోళనకు గురైంది. ఐదు వందల ఫైన్ మీరు కడతారా అంటూ నటిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు క్యాబ్ డ్రైవర్. అంతే కాకుండా ఆమెను దూషించాడు. వెంటనే గ్రహించిన నటి గట్టిగా అరవడంతో రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనదారులు, ఆటోవాలా ఆమెను రక్షించారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సురక్షితంగా బయటపడినా తీవ్రమైన భయాందోళనకు గురైనట్లు మానవ నాయక్ తెలిపింది.  మానవ నాయక్ హిందీతో పాటు పలు మరాఠీ చిత్రాల్లో నటించింది.

ఈ విషయంపై ముంబై జాయింట్ సీపీ స్పందించారు. నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు తీవ్రంగా పరిగణిస్తామని వెల్లడించారు. డీసీపీ స్థాయిలో దీనిపై విచారణ చేపడతామని ఆమె పోస్ట్‌కు ఆయన బదులిచ్చారు. ఈ ఘటనలో క్యాబ్ సంస్థను వివరణ కోరుతున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు. 


 

Videos

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)