Breaking News

ప్రెస్‌మీట్‌లో ఇదేం ప్రశ్న.. ఫైర్‌ అయిన నటి

Published on Fri, 11/07/2025 - 10:58

తమిళ సినిమా '96'తో తెలుగువారికి పరిచయమైన గౌరీ కిషన్‌(Gouri Kishan )కు మీడియా సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త సినిమా అదర్స్‌ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ యూనిట్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే, ఈ సమావేశంలో తన బరువు గురించి అవమానకరమైన ప్రశ్న అడిగినందుకు రిపోర్టర్‌కు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. ఆపై తన ప్రశ్నను అతను సమర్థించుకునేందుకు ప్రయత్నం చేయడంతో గౌరీ కూడా ఫైర్‌ అయింది. దీంతో ఆమెకు  నెటిజన్లు మద్ధతుగా నిలిచారు.

తమిళ, మలయాళ చిత్రాలతో గౌరీ కిషన్‌ ఫుల్‌ బిజీగా ఉంది. అబిన్ హరికరణ్ దర్శకత్వంలో తను నటిస్తున్న కొత్త చిత్రం ‘అదర్స్‌’ త్వరలో విడుదల కానుంది. దీంతో ప్రచారంలో భాగంగా  ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. అయితే, ఈ సమావేశంలో ఒక జర్నలిస్ట్‌ ‘మీ బరువు ఎంత ఉంటుంది..?’ అని ప్రశ్నించాడు. సమాధానం చెప్పేందుకు గౌరీ అసహనం వ్యక్తం చేయడంతో ఆ జర్నలిస్ట్‌ కూడా తన ప్రశ్నను సమర్థించుకుంటూ మరోసారి అడిగాడు. ఈ ప్రశ్నకు గతంలో కొందరు స్టార్‌ హీరోయిన్లు కూడా సమాధానం చెప్పారని వాయిస్‌ పెంచాడు. 

నా బరువుతో మీకేంటి అవసరం
దీంతో  గౌరీ కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. 'నా బరువు గురించి నాతో చర్చించే హక్కు దర్శకుడికి ఉంది. కానీ, ఒక జర్నలిస్ట్‌గా మీకేంటి అవసరం..? స్త్రీ శరీరం చాలా సంక్లిష్టమైనది, హార్మోన్ల అసమతుల్యతతో ఉంటుంది. నా  ఆరోగ్య పరిస్థితి గురించి తెలియకుండానే, నా బరువు గురించి అడగడానికి మీరు ఎవరు.. నా బరువు తెలుసుకొని మీరు ఏం చేస్తారు..? నా బరువు వల్ల సినిమాకు ఏమైనా నష్టం జరిగిందా..? ఇప్పటికి నేను చాలా సినిమాలు చేశాను. నా ప్రతిభ గురించి అడగండి. కనీసం ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల గురించి అడగరెందుకు..' అని ఆమె ఫైర్‌ అయింది. ఆ జర్నలిస్ట్‌ కూడా తన తప్పును తెలుసుకుని ఆమెకు వెంటనే క్షమాపణ చెప్పాడు. ఆమెను బాడీ షేమింగ్‌ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.

జర్నలిస్టుల పట్ల తనకు ఎంతో  గౌరవం ఉందని గౌరీ కిషన్‌ చెప్పింది. తాను కూడా జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్‌ నుంచే వచ్చానని తెలిపింది.  కానీ, ఇలాంటి ప్రశ్నలు జర్నలిస్టిక్ నీతిని పాటించవని స్పష్టం చేసింది. ప్రెస్ మీట్ సందర్భంగా తనను ఇలా ఇబ్బంది పెట్టడం బాధ అనిపించినప్పటికీ వారి పట్ల తనకు ఎటువంటి ద్వేషం లేదని ఆమె స్పష్టం చేసింది.

96 సినిమా త్రిష  చిన్నప్పటి పాత్రలో గౌరీ కిషన్ నటించింది. ఇదే మూవీ తెలుగులో జాను పేరుతో విడుదలైంది. ఆమె ఇందులో కూడా నటించిది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది.  తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)