Breaking News

అప్పుడు రూ.500 అప్పు.. ఇప్పుడు రూ.90 కోట్ల కలెక్షన్స్‌!

Published on Mon, 02/16/2026 - 12:03

ఏదో ఒక కథ రాసుకున్నామా? పెద్ద హీరోను పెట్టామా? రెండు ఫైట్‌ సీన్లు, రెండు లవ్‌ సాంగ్స్‌తో మమ అనిపించేశామా? అంటే కుదరదు. ఈరోజుల్లో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే వారి మనసును కదిలించేలా సినిమా ఉండాలి. వారు పెట్టిన డబ్బుకు సంతృప్తినిచ్చేదై ఉండాలి. అలాగైతేనే జనం సినిమాకు ఓటేస్తున్నారు, లేదంటే మూవీ చిన్నదైనా, పెద్దదైనా జనం ముఖం చాటేస్తున్నారు.

ఫస్ట్‌ సినిమాతోనే హిట్‌
అలాంటిది తొలి సినిమాతోనే టాలెంట్‌ చూపించాడు తమిళ దర్శకుడు అభిషన్‌ జీవింత్‌. యూట్యూబర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన అతడు టూరిస్ట్‌ ఫ్యామిలీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అభిషన్‌. శశికుమార్‌, సిమ్రాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది మే 1న విడుదలవగా ప్రేక్షకులను నవ్విస్తూనే హృదయాలను కదిలించింది. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ప్రేమ వివాహం
పెద్ద డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయకపోయినప్పటికీ సొంత టాలెంట్‌తో గొప్ప సినిమా తీసి అందరి మన్ననలు పొందాడు. రజనీకాంత్‌, సూర్య, రాజమౌళి, నాని.. ఇలా ఎందరో ప్రముఖులు ఆయన ప్రతిభను ప్రశంసించారు. ఈ ఆనందంలోనే అభిషన్‌.. ప్రియురాలిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ వివాహానికి టూరిస్ట్‌ ఫ్యామిలీ నిర్మాత మగేశ్‌ రాజు హాజరై బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌ ఇచ్చాడు. 

హీరోగానూ టాలెంట్‌
ఇక దర్శకుడిగా నెక్స్ట్‌ ఏం సినిమా చేస్తాడు? అనుకుంటే హీరోగా మారాడు. విత్‌ లవ్‌ మూవీతో కథానాయకుడిగానూ విజయం సాధించాడు. అయితే ఒకప్పుడు అభిషన్‌ రోజూవారీ ఖర్చుల కోసం రూ.500 స్నేహితుడిని అప్పడిగాడు. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు బాక్సాఫీస్‌పై కోట్లు కురిపించే సినిమాలు తీసే రేంజ్‌కు ఎదిగాడు. 26 ఏళ్ల వయసులోనే ఇంత సక్సెస్‌ చూస్తున్న అభిషన్‌ మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం!

చదవండి: ఆ హీరోయిన్‌కు ఫోన్‌ చేసి సారీ చెప్పా: రవీనా టండన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)