Breaking News

నేరుగా ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Thu, 06/19/2025 - 15:26

అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాళిధర్ లపతా'. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. ఈ ‍మూవీని జీ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై విడుదలకు సిద్ధమైంది.

‍అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు అభిషేక్ బచ్చన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు కాళిధర్ లపతా పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం జూలై 4న జీ5లో ప్రీమియర్ అవుతుందని తెలిపారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ టైటిల్ రోల్‌ పోషించగా.. దైవిక్ భగేలా, జీషన్ అయూబ్‌ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాను ఓటీటీలోనే చూసేయండి.

తన కుటుంబం తనను వదిలించుకోవాలని చూస్తున్న విషయం తెలుసుకున్న ఓ వృద్ధుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కుటుంబానికి దూరంగా పారిపోవడానికి ఆ వృద్ధుడు యత్నిస్తాడు. అతనికి ఎనిమిదేళ్ల అనాథ అయిన బల్లుతో ఊహించని పరిచయం.. జీవితాన్ని మార్చే సంఘటనకు దారితీస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ చిత్రంలో చూపించారు. కాగా.. అభిషేక్ బచ్చన్ చివరిసారిగా 'హౌస్‌ఫుల్ 5'చిత్రంలో కనిపించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
 

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)