మొదటి భార్యతో విడాకులు.. మద్యానికి బానిసయ్యా: అమిర్ ఖాన్

Published on Sun, 06/29/2025 - 18:45

ఇటీవలే సితారే జమీన్‌ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్‌ హీరో అమిర్ ఖాన్. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్‌ ఫిల్మ్‌ ‘తారే జమీన్  పర్‌’ (2007)కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్‌  నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య రీనా దత్తాతో విడిపోయాక ఎదుర్కొన్న పరిస్థితిని వివరించారు. ఆ టైమ్‌లో తీవ్రమైన ఒత్తిడి, బాధకు గురయ్యానని వెల్లడించారు. దీంతో మద్యానికి బానిసైనట్లు తెలిపారు. నా సినిమా లగాన్‌ విజయం సాధించినప్పటికీ.. జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించదన్నారు. అది తన జీవితంలో చీకటిదశ అని పేర్కొన్నారు.

అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'రీనాతో నేను విడిపోయినప్పుడు ఆ రోజు సాయంత్రంమే మద్యం ఫుల్ బాటిల్ తాగాను. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం తాగాను. ఆ సమయంలో ఎప్పుడూ నిద్రపోలేదు. అధిక మద్యం సేవించడం వల్ల నేను స్పృహ కోల్పోయేవాడిని. ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించా. ఆ సమయంలో ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు. అదే ఏడాది నా సినిమా లగాన్ రిలీజైంది. అప్పట్లో నన్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని పిలిచారు. అది నాకు చాలా వ్యంగ్యంగా అనిపించింది' అని పంచుకున్నారు.

కాగా.. ఆమిర్, రీనా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంతేకాదు అమిర్ ఖాన్ తన రక్తంతో ఆమెకు ఒక లేఖ కూడా రాశాడు. రీనా మొదట అమిర్ ప్రేమను అంగీకరించలేదు.. కానీ తరువాత ఓకే చెప్పి.. ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా రీనా దత్తా ఆమిర్ మొదటి చిత్రం 'ఖయామత్ సే ఖయామత్ తక్'లో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది. వీరి వివాహమైన 16 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఈ జంటకు జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమిర్ 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ జంట 16 సంవత్సరాల తర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆమిర్ ప్రస్తుతం తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్‌లో ఉన్నారు.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)