Breaking News

ఒకే కారులో ఇద్దరు మాజీలు, ప్రియురాలు.. ఇదెలా సాధ్యం..!

Published on Wed, 06/17/2026 - 13:08

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వచ్చే నెలలోనే పెళ్లాడనున్నారు. ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కనున్నారు. గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా  బెంగళూరుకు చెందిన తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశారు. ఇరువురి కుటుంబాల అంగీకారంతో జూలై 5న పెళ్లి చేసుకోబోతున్నారు.

ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అమిర్ ఖాన్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగిన సంగతి తెలిసిందే. మొదట రీనా దత్తాను పెళ్లాడిన ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. అనంతరం దర్శకురాలు కిరణ్ రావును ఆయన పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకు వీరిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు.

ముచ్చటగా మూడోసారి తన ప్రియురాలితో అమిర్ ఖాన్ పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఇద్దరు  మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్‌రావు, ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి ఓకే కారులో కనిపించారు. అమిర్ ఖాన్‌ ముందు సీటులో కూర్చోగా ముగ్గురు వెనక సీటులో కూర్చుని ప్రయాణించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముగ్గురు భార్యలతో కనిపించడం ఏ స్టార్ హీరోకు సాధ్యం కాదంటూ పోస్టులు పెడుతున్నారు. 
 

 

 

Videos

దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం

లోకేష్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. ఎందుకంటే ?

Pulivendula : ఇసుక వేస్తే రాలనంత జనం

జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు

CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!

నీకెందుకు తల్లి మేకప్ మేకప్ అంటే నీకు ప్యాకప్ ఖాయం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి... క్రికెటర్ అభిషేక్‌పై మహిళ కేసు

76 ఏళ్లు వచ్చాయి... సిగ్గులేదు! సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

చంపేందుకే లోహగఢ్ ట్రెక్కింగ్ ప్లాన్ CCTV కెమెరాలో అంతా రికార్డ్

లాకప్ డెత్ చంద్రబాబు ఎలా కప్పిపుచ్చారు..? అసలు నిజాలివే..!

Photos

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)

+5

సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు

+5

గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్

+5

కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)

+5

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు)

+5

టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్‌ అట్రాక్షన్‌గా తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్.. చిరు-చరణ్ స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)