Breaking News

ఓటీటీలో చూడండి.. స్టేజీపై నోరు జారి.. అంతలోనే సారీ!

Published on Mon, 06/23/2025 - 18:07

ఎంత పెద్ద సినిమా అయినా సరే.. కథలో దమ్ముంటేనే జనాలు థియేటర్‌కు వస్తున్నారు. ఏమాత్రం నచ్చకపోయినా మాకు అక్కర్లేదు అంటూ ఆ దిక్కు కూడా చూడటం లేదు. ఇండియన్‌ 2, థగ్‌ లైఫ్‌ ఫెయిల్యూర్స్‌ అందుకు పెద్ద ఉదాహరణ.. ఇకపోతే లేటెస్ట్‌గా కుబేర, 8 వసంతాలు (8 Vasantalu Movie) చిత్రాలు రిలీజయ్యాయి. కుబేర బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతోంది. అటు 8 వసంతాలు మూవీకి కూడా కాస్త పాజిటివ్‌ టాక్‌ లభించినప్పటికీ కుబేర ముందు తేలిపోయింది.

ఓటీటీలో బాగుంటుంది
ఇలాంటి సమయంలో ప్రేక్షకుల్ని తమ సినిమా వైపు ఎలా తిప్పుకోవాలా? అని చిత్రయూనిట్‌ ఆలోచించాలి! కానీ దర్శకుడు ఫణీంద్ర సక్సెస్‌ మీట్‌కు డుమ్మా కొట్టాడు. మరోవైపు సినిమాటోగ్రాఫర్‌ విశ్వనాథ్‌ రెడ్డి మాత్రం ఎంచక్కా ఓటీటీలో చూసేయమని చెప్తున్నాడు. సక్సెస్‌ మీట్‌లో విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. ఇది త్వరలోనే ఓటీటీలోకి వస్తుంది. అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది. థియేటర్‌లో చూసిన ఎక్స్‌పీరియన్స్‌ కంటే ఇంకా బెటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఉండబోతుంది. ఇమేజ్‌ క్వాలిటీ ఇంకా మెరుగ్గా ఉంటుంది అంటూ తమ సినిమాను ఓటీటీలో చూడమని చెప్పకనే చెప్పాడు. అక్కడున్నవాళ్లు మధ్యలో కలుగజేసుకోవడంతో స్టేజీపైనే సారీ చెప్పాడు.

సినిమా
8 వసంతాలు చిత్రంలో మ్యాడ్‌ ఫేమ్‌ అనంతిక సనిల్‌ కుమార్‌ కథానాయికగా నటించింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, సమీరా కిశోర్‌, కన్నా పసునూరి కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

చదవండి: థగ్‌ లైఫ్‌ డిజాస్టర్‌.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)