Breaking News

ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే..

Published on Fri, 09/16/2022 - 16:04

కరోనా కాలంలో ఓటీటీలకు ప్రేక్షకాదరణ బాగా పెరిగింది. ఇక థియేటర్లో వచ్చిన చిత్రాలను మళ్లీ చూడాలనుకుంటే ఓటీటీలే వేదికగా నిలుస్తున్నాయి. దీంతో తమకు నచ్చిన  సినిమాను ఎప్పుడైనా, ఎక్కడైన చూసే వేసులుబాటు కల్పిస్తున్నాయి ఓటీటీలు. ఈ నేపథ్యంలో ఇటీవల బిగ్‌స్క్రీన్‌పై సందడి చేసిన పలు చిత్రాలు ఈ రోజు(సెప్టెంబర్‌ 16న) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. వాటితోపాటు పలు వెబ్‌సిరీస్‌లు కూడా అలరించబోతున్నాయి. అలా ఈ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరి అవేంటో చూద్దామా!

‘సోనిలివ్‌’లో రామారావు ఆన్‌డ్యూటీ
రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్‌గా నటించారు. జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక చాలా గ్యాప్‌ అనంతరం నటుడు వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. థియేటర్లో పెద్దగా ఆడని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. సోనీలివ్‌లో ఈ రోజు నుంచే రామారావు ఆన్‌డ్యూటీ స్ట్రీమింగ్‌ అవుతుంది.

‘హాట్‌స్టార్‌’లో విక్రాంత్‌ రోణ
కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం 'విక్రాంత్‌ రోణ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లో జులై 28న గ్రాండ్‌గా రిలీజై సూపర్‌ హిట్‌ కలెక్షన్లను రాబట్టింది.  అనూప్ భండారీ దర్శకత్వం వహించగా జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో  బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నటించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ప్రముఖ  డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈరోజు(శుక్రవారం)నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. మరి బిగ్‌ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేసేయండి. 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
దహన్ – సిరీస్ 1(హిందీ)

అమెజాన్ ప్రైమ్:
గుడ్ నైట్ మమ్మీ – ఇంగ్లీష్

ఆహా:
మోసగాళ్లు(తెలుగు)
కిరోసిన్(తెలుగు)

సోనీ లివ్:
కాలేజీ రొమాన్స్ – సిరీస్ 3(హిందీ)

జీ5:
టైంపాస్ 3 – మరాఠీ

నెట్ ఫ్లిక్స్:
జోగి – హిందీ
అటెన్షన్ ప్లీజ్ – హిందీ
ఫైండింగ్ హబ్బీ 2 – ఇంగ్లీష్ 
ఫేట్: ది వింక్స్ సాగా – సిరీస్ 2(ఇంగ్లీష్)
స్కాండల్: బ్రింగింగ్ డౌన్ వైర్ కార్డ్ – డాక్యుమెంటరీ సిరీస్(ఇంగ్లీష్)
శాంటో – సిరీస్ 1(స్పానిష్)
లవ్ ఈజ్ బ్లైండ్ – సిరీస్ 2(ఇంగ్లీష్)
జిమ్నాటిక్స్ అకాడమీ: ఏ సెకండ్ ఛాన్స్ – సిరీస్ 2(ఇంగ్లీష్)
డు రివెంజ్ – ఇంగ్లీష్
ఐ యూజ్డ్ టు బి ఫేమస్ – ఇంగ్లీష్
ది బ్రేవ్ వన్స్ – ఇంగ్లీష్
డ్రిఫ్టింగ్ హోమ్ – జాపనీస్

మరి ఇంకేందుకు ఆలస్యం ఇంట్లోనే ఎంచక్కా మీకు నచ్చిన ఈ కొత్త సినిమాలను ఓటీటీల వేదికగా చూసి ఎంజాయ్‌ చేయండి. 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)