Breaking News

మా అభ్యంతరాలు వినాల్సిందే 

Published on Sun, 08/10/2025 - 06:24

కీవ్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్‌ మధ్య ఈ నెల 15న జరుగబోతున్న భేటీ పట్ల ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ అసహనం వ్యక్తంచేశారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వారిద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఒప్పందం కుదుర్చుకున్నా అది తమకు సమ్మతం కాబోదని తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ‘టెలిగ్రామ్‌’లో పోస్టు చేశారు. రష్యా ఆక్రమణలో ఉన్న తమ భూభాగాలను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. అవి ఏనాటికైనా ఉక్రెయిన్‌లో కలవాల్సిందేనని తేల్చిచెప్పారు. 

ఒకవేళ వాటిని రష్యాలో అంతర్భాగంగా అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తే సంఘర్షణ మరింత ముదురుతుంది తప్ప తగ్గబోదని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ట్రంప్‌–పుతిన్‌ చర్చల్లో ఈ అంశంపై చర్చ జరగదనే భావిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్‌–రష్యా మధ్య శాంతి కోసమే ఆ ఇరువురు నేతల చర్చలు పరిమితమైతే బాగుంటుందని వెల్లడించారు. రెండు దేశాల నడుమ శాశ్వత శాంతి సాధ్యం కావాలంటే తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆక్రమణదారులకు తమ భూమి అప్పగించేందుకు సిద్ధంగా లేమన్నారు. 

ఉక్రెయిన్‌ ప్రమేయం లేకుండా ఇతర పక్షాలు తీసుకొనే ఏ నిర్ణయమైనా అది శాంతికి వ్యతిరేకమే అవుతుందన్నారు. పరిష్కారమార్గాలను చంపేసేలా ఎవరూ వ్యవహరించవద్దని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌ సిటీపై రష్యా సైన్యం శనివారం డ్రోన్లతో దాడికి దిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉక్రెయిన్‌ పౌరులు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. జపొరిజియాలో జరిగిన మరో దాడిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. రష్యా సైన్యం 47 డ్రోన్లు ప్రయోగించగా, వాటిలో 16 డ్రోన్లను మధ్యలోనే కూల్చివేశామని ఉక్రెయిన్‌ వైమానిక దళం ప్రకటించింది. రెండు క్షిపణులు సైతం ప్రయోగించగా, ఒక క్షిపణిని ధ్వంసం చేశామని తెలియజేసింది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)