Breaking News

రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌

Published on Sat, 06/20/2026 - 12:26

వాషింగ్టన్: ఖతార్ దేశం బహుమతిగా ఇచ్చిన, అమెరికా అధ్యక్షుడి కొత్త 'ఎయిర్ ఫోర్స్ వన్' (Air Force One) విమానాన్ని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆవిష్కరించారు. సరికొత్త బోయింగ్ 747-8ను  ఒక "ఫ్లయింగ్ వైట్ హౌస్" (గాల్లో ఎగిరే శ్వేతసౌధం)గా అభివర్ణించారు.

అధ్యక్షుడు  ట్రంప్ యూఎస్ ఎయిర్ ఫోర్స్ సరికొత్త విమానం 'వీసీ-25బి బ్రిడ్జ్' (VC-25B Bridge)ను  జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఈ విమానాన్ని పరిశీలించిన అనంతరం ఆవిష్కరించారు. విమాన హ్యాంగర్ (విమానశ్రయ షెడ్)లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానం అని ప్రకటించారు. ఇంతటి అద్భుతమైన విమానాన్ని అందించినందుకు ఖతార్ దేశాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. దాదాపు 35 ఏళ్ల నాటి పాత అధ్యక్ష విమానాల స్థానంలో, అమెరికా అగ్రరాజ్య శక్తికి ప్రతీకగా ఈ కొత్త విమానం నిలుస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. శాశ్వత నెక్స్ట్-జనరేషన్ 'ఎయిర్ ఫోర్స్ వన్' ప్రోగ్రామ్ పూర్తయ్యే దాకా, బోయింగ్ 747 తాత్కాలిక అధ్యక్ష విమానంగా సేవలు అందిస్తుందని  ట్రంప్‌ ప్రకటించారు. 

ఇదీ చదవండి : రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్‌ డ్రామా : సంచలన ఆరోపణలు

విమానం ప్రత్యేకతలపై ట్రంప్‌ వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ఈ విమానంలో ప్రయాణించేటప్పుడు అధికారికంగా దీనిని 'ఎయిర్ ఫోర్స్ వన్' అని పిలుస్తారు. ఈ విమానం లోపలి భాగాన్ని పరిశీలించిన ఒక జర్నల్‌ కథనం ప్రకారం, అధునాతన లెదర్ సీట్లు, ఖరీదైన తివాచీలు (కార్పెట్లు), చెక్క ప్యానెలింగ్ , బంగారం రంగుల షేడ్స్‌తో కూడిన గోడలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాషింగ్టన్ ల్యాండ్‌మార్క్ రిఫ్లెక్టింగ్ పూల్'లో ఒక బాతు ఈదుతున్నట్లు ఉన్న ఫ్రేమ్డ్ పెయింటింగ్‌తో పాటు దేశభక్తిని ప్రతిబింబించే చిత్రాలను గోడలపై అలంకరించారు. అద్భుతమైన వేగంతో ఇది  దూసుకుపోతుంది.  అలాగే ఇప్పటివరకు ఉన్న పాత విమానం నీలం మరియు తెలుపు రంగులో ఉండేది. కానీ కొత్త విమానం కింది భాగం 'నేవీ బ్లూ', మధ్యలో ఒక 'ఎరుపు గీత' , పైభాగం 'తెలుపు' రంగుతో సరికొత్తగా రూపొందించారు.

> ఇప్పటివరకు ఉన్న అన్ని ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల కంటే చాలా వేగంగా, చాలా దూరం ప్రయాణించగలదని అని ట్రంప్ ప్రశంసించారు. జూలై 4న జరిగే అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కొత్త విమానం ఫ్లైఓవర్‌ (గగన విన్యాసాలు) లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

మరోవైపు వందల మిలియన్ల డాలర్ల విలువైన ఈ విమానాన్ని ఖతార్ బహుమతిగా ఇవ్వడంపై అమెరికాలో నైతిక, రాజ్యాంగపరమైన భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ బహుమతిని తిరస్కరించడం  మూర్ఖత్వం అవుతుందని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ విమానాన్ని తన ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి విరాళంగా ఇస్తానని చెప్పడం మరింత చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

కాగా 1990ల నుండి సేవల్లో ఉన్న పాత విమానాలను మార్చాలనేది ట్రంప్ మొదటి విడత పదవీకాలం నాటి నుండి ఉన్న బలమైన కోరిక. అధ్యక్షుడి విమాన శ్రేణి కోసం రెండు కొత్త 747-8 విమానాలను సరఫరా చేయడానికి అమెరికా ప్రభుత్వం గతంలో 'బోయింగ్' సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాటు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ తరుణంలో ఖతార్ ఇచ్చిన విమానాన్ని ట్రంప్ ఆవిష్కరించడం గమనార్హం.

ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్‌, 75 రోజులకే పెళ్లి : నటి లవ్‌ స్టోరీ 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)