Breaking News

మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్‌, వీడియో వైరల్‌

Published on Thu, 01/08/2026 - 15:55

అమెరికాలో వలసదారులపై జరుగుతున్న దాడుల్లో భాగంగా  ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ దారుణానికి  ఒడిగట్టాడు. ఒక మహిళను కాల్చి చంపిన ఘటన  కలకలం రేపింది. మిన్నియాపాలిస్‌లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో  వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం  నెలకొంది. 

బుధవారంమిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లో ఇమ్మిగ్రేషన్ అండ్‌ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా  నిరసనకారులు ఉద్యమానికి దిగారు. నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, కారులో కూర్చున్న మహిళ తలపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో రెనీ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో వాతావరణం  మరింత ఉ​ద్రిక్తంగా మారింది.

 

ఇమ్మిగ్రేషన్ అమలు సమయంలో అధికారులను అడ్డుకోడంతో కాల్పులు జరిపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఘర్షణ సమయంలో మహిళపై కాల్పులు జరిగాయని DHS ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ తెలిపారు. అల్లర్లకు, రెనీ గుడ్‌కు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలి తల్లి  డోనా గాంగర్  విచారం వ్యక్తం చేసింది. తన  కుమార్తె ఎంతో దయగల, గొప్ప మనిషి, ప్రజలంటే ప్రేమగల ఆమెను అన్యాయంగా కాల్చి చంపారని  తల్లి వాపోయింది. 

అమెరికాలో  పెరుగుతున్న గన్‌ కల్చర్‌, హింస సర్వసాధారణంగా మారింది అని చెప్పడానికి మరో స్పష్టమైన ఉదాహరణ అని విశ్వవిద్యాలయ అధ్యక్షుడు బ్రియాన్ హెంఫిల్ వ్యాఖ్యానించారు.  వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనం అంటూ ఆగ్రహం పెల్లుబుకింది. వందలాది మంది నిరసనలకు దిగారు. మిన్నియాపాలిస్ నగర కౌన్సిల్‌లోని మెజారిటీ సభ్యులు రెనీ మరణానికి కారణమైన ఏజెంట్‌ను అరెస్టు చేసి,  విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ICE తమ నగరాన్ని విడిచి పెట్టాలంటున్నారు. 


అధికారుల భిన్నవాదనలు
ఈ సంఘటనల గురించి ఫెడరల్ , స్థానిక అధికారులు చాలా భిన్నవాదనలు వినిపిస్తున్నారు.  కారును  ఆపి బయటికి రావాలని ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా ఏజెంట్‌పై ఎదురుదాడికి దిగి,  ICE అధికారిని ఢీకొట్టడానికి  ప్రయత్నించినందున మహిళను కాల్చి చంపామని అంటున్నారు.   ఈ ఘటనపై  FBI దర్యాప్తు జరుగుతోంది

2020లో ఓల్డ్ డొమినియన్ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో పట్టభద్రురాలైంది గుడ్‌.  ఆమె  కవయిత్రి కూడా. ప్రస్తుతం రెనీ నికోల్ గుడ్ తన భాగస్వామితో మిన్నియాపాలిస్‌లో నివసిస్తోంది.కాగా ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు  చేపట్టిన తరువాత  వలసదారుల ఆంక్షలు, దాడుల్లో  చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది.
ఇదీ చదవండి: బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్‌, పరారీలో ఎస్‌ఐ

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)