Breaking News

ఇరాన్ సుప్రీం ఖమేనీ భార్య 'మన్సూరే' మృతి

Published on Mon, 03/02/2026 - 23:02

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిగిన నేపథ్యంలో ఖమేనీ కుటుంబ సభ్యులు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఆ దాడుల్లో ఖమేనీ భార్య తీవ్రంగా గాయపడింది. దాంతో మన్సూరేని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే మన్సూరే మృతిపై ఇరాన్‌ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సోమవారం నాడు తను మరణించినట్టు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి చెందారు. ఖమేనీ మృతితో ఇప్పటికే ఇరాన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మన్సూరే ఖోజాస్తే కూడా మరణించడంతో ఉద్రితకలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సామ్రాజ్యవాద శక్తుల దాడులను భీకరంగా తిప్పికొడతామని ఇప్పటకే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)