Breaking News

తప్ప తాగి.. నాతో అనుచితంగా ప్రవర్తించారు

Published on Wed, 05/28/2025 - 10:50

ఆయనో సీనియర్‌ పార్లమెంటేరియన్‌. చట్ట సభకు సంబంధించిన ఓ కార్యక్రమం జరుగుతోంది. ఆ ఈవెంట్‌లో పీకల దాకా తాగారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న యువ సభ్యురాలితో అనుచితంగా ప్రవర్తించారు. ఇది ఫిర్యాదు దాకా వెళ్లింది. 

సీనియర్‌ సభ్యుడొకరు తనను బాగా ఇబ్బంది పెట్టారని ఆస్ట్రేలియా స్వతంత్ర సెనేటర్‌ ఫాతిమా పేమన్‌(Fatima Payman) ఆరోపణలకు దిగారు. ఈ మేరకు పార్లమెంటరీ వర్క్‌ప్లేస్‌ సపోర్ట్‌ సిస్టమ్‌(PWSS)లో ఆమె ఫిర్యాదు కూడా చేశారు. ‘‘పార్లమెంట్‌ వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన బాగా తాగారు. నన్ను కూడా తాగి.. టేబుల్‌ ఎక్కడి డ్యాన్స్‌ చేయమంటూ బలవంతం చేయబోయారు. అయితే అందుకు నేను ఒప్పుకోలేదు. 

.. నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి అంటూ కటువుగానే ఆయనకు సమాధానం ఇచ్చా’’ ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సదరు సీనియర్‌ సెనేటర్‌ పేరును ఆమె మీడియాకు ప్రస్తావించలేదు. అయితే ఆ వ్యాఖ్యలు మతపరంగా తన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు లైంగిక వేధింపుల కిందకు వస్తుందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన పీడబ్ల్యూఎస్‌ విచారణ జరుపుతామని ఆమెకు హామీ ఇచ్చింది.

అఫ్గన్‌ సంతతికి చెందిన ఫాతిమా(30).. 2022లో లేబర్‌ పార్టీ(Labour Party) తరఫున వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా నుంచి ఎన్నికయ్యారు. ఆ టైంలో అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. 2024లో పాలస్తీనా తీర్మానం సమయంలో ఆమె పార్టీ వైఖరికి విరుద్ధంగా ఓటేశారు.  ఈ పరిణామంతో ఆమె లేబర్‌ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి: ఇదేం చెండాలం?.. నడిరోడ్డు మీద డర్టీ పిక్చర్‌

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)