Breaking News

పశ్చిమాసియాలో నిప్పుల వాన.. ఇజ్రాయెల్‌ ట్రెండింగ్‌లో యాప్‌

Published on Sun, 03/08/2026 - 13:43

అహ యేమి హాయిలే హలా.. అంటూ హాయిగా స్నానం చేసే భాగ్యం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్‌ ప్రజలకు లేదు. ఇరాన్‌ దాడుల వేళ నచ్చినప్పుడు బాంబ్‌ షెల్టర్ల నుంచి బయటికొచ్చి ఇంట్లో కిటికీల సమీపంలో స్నానం చేసే ఆస్కారం ఇప్పుడు ఇజ్రాయెల్‌ ప్రజలకు లేదు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు బాంబులు పడితే ఇక అంతే. అందుకే ఇప్పుడు ఇజ్రాయెలీల స్నానభయాలను పోగొట్టేందుకు కొత్త యాప్‌ అందుబాటులోకి వచ్చింది. రోజులో ఏ సమయంలో క్షిపణులు తక్కువ పడే అవకాశం ఉందో అంచనావేసి యూజర్లకు సూచిస్తుంది. అవసరం.. ఆవిష్కరణకు తల్లిలాంటిది అంటారు.

అలా ఇజ్రాయెలీల పలు రకాల అవసరాలకు తగ్గట్లు వినూత్న యాప్‌లు ఇప్పుడు ఆ దేశంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. రాకెట్‌లు తక్కువగా పడే సమయాన్ని దాదాపు ఖచ్చితంగా అంచనావేసి చెప్పే ‘కెన్‌ ఐ షవర్‌?(నేనిప్పుడు స్నానం చేయొచ్చా?’అనే యాప్‌ ఇప్పుడు అక్కడ తెగ ఆదరణ పొందుతోంది. ఇప్పటికే అంకురసంస్థల దేశంగా పేరొందిన ఇజ్రాయెల్‌లో ఇప్పుడు ఈ యాప్‌కు ట్రెండింగ్‌లో ఉంది. యాప్‌ను ఉపయోగించే యూజర్‌ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు? బాంబు షెల్టర్‌ నుంచి అతని స్నానాల గది ఎంత దూరంలో ఉంది? అతను ఎంతసేపు స్నానంచేస్తాడు?

స్నానంచేశాక తిరిగి బాంబుషెల్టర్‌కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది? అనే వివరాలను యాప్‌కు అందజేస్తే ఆయా వ్యక్తులు స్నానంచేసే వేగం, షెల్టర్‌ దూరం, క్షిపణులు పడే అవకాశాలను గణించి ఆయా వ్యక్తులకు తగ్గట్లుగా ‘స్నానం సమయం’ను యాప్‌ సూచిస్తుంది. రోజులో ఎన్ని గంటలకు బాత్రూమ్‌కు వెళ్లాలో చెబుతుంది. రాకెట్లు పడిన సమయాలు, ఎంతసేపు పడ్డాయి, ఎక్కడ పడ్డాయి, ఎంత సేపు ప్రభుత్వం అలర్ట్‌లు, సైరన్‌లు ఇచ్చిందనే డేటాను విశ్లేషించి ఆరోజుకు ‘సురక్షిత స్నాన సమయం’ను యాప్‌ సూచిస్తుంది. ‘హోం ఫ్రంట్‌ కమాండ్‌’, ‘రెడ్‌ అలర్ట్‌’వంటి యాప్‌లు సైతం వార్నింగ్‌ సందేశాలను పంపిస్తూ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి.

యుద్ధంలోనూ ప్రేమ.. 
యుద్ధజ్వాలల్లోనూ ప్రేమాగ్నిలో కరిగిపోయే జంటలు, యువత కోసం విభిన్నమైన యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. పనిమీద బయటికొచ్చాక సైరన్‌లు మోగగానే సమీప బంకర్‌ వైపు పరుగెడతారు. అప్పటికే ఆ బంకర్‌లో మనకు తెల్సిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? మనతో ఆత్మీయంగా మాట్లాడేందుకు ఎవరైనా ఆసక్తిచూపిస్తున్నారా? అని తెల్సుకునేందుకు కొన్నియాప్‌లు రంగంలోకి దూకాయి. బంకర్‌ ముఖద్వారాల వద్ద క్యూఆర్‌ కోడ్‌లను అందుబాటులోకి తెచ్చా రు. ఆ కోడ్‌ను స్కాన్‌చేస్తే ఆ బంకర్‌లో ఉన్న వాళ్ల సోషల్‌మీడియా ప్రొఫైళ్లు ప్రత్యక్షమవుతాయి. కావాలంటే వాళ్లకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపడం లేదా చాటింగ్‌ మొదలెట్టవచ్చు. ఏకాకులుగా ఉండిపోయిన సింగిల్స్‌తో మాట్లాడించే డేటింగ్‌ యాప్‌లూ బాంబర్‌ల వద్ద క్యూఆర్‌ కోడ్‌రూపంలో ప్రత్యక్షమవుతున్నాయి.  

సురక్షిత మార్గాలనూ చూపుతూ.. 
ఇప్పటిదాకా క్షిపణులు పడని ప్రాంతాలను గుర్తించి స్థానికులకు ఆయా సమాచారాన్ని కొన్ని యాప్‌లు చేరవేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం గుండా వెళ్లే ఇతరులు ఆ డేటా ప్రకారమే సురక్షిత రోడ్లు మార్గాల్లోనే ప్రయాణించేందుకు అవకాశం చిక్కుతోంది. వేరే ప్రాంతాలకు వచ్చినప్పుడు సమీపంలోని షెల్టర్‌ లొకేషన్‌ను సూచించే యాప్‌లు వచ్చేశాయి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌