Breaking News

ఇండియా-పాక్ వార్‌.. చైనా అక్కసు

Published on Wed, 12/31/2025 - 15:12

ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ విషయంపై భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ మామ తన తీరు మార్చుకోవడం లేదు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానితో జరిగిన భేటీలో కూడా ఈ వ్యాఖ్యలే చేశారు.ఇది చాలదన్నట్లు తాజా ఆజాబితాలో చైనా దేశం కూడా చేరింది.

ఆపరేషన్ సిందూర్‌ విషయంలో భారత్‌కు తంటాలు తప్పడం లేదు. ఇండియన్ ఆర్మీ ముష్కరుల స్థావరాల్ని వారి స్వస్థలంలోనే ధ్వంసం చేసి ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలిసేలా చేసింది. తన జోలికస్తే రిప్లై ఏలా ఉంటుందో చిన్న ట్రైలర్‌ చూపించింది. దీంతో భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైన పాక్ దారికొచ్చింది. ఇరు దేశాలు పరస్పర కాల్పులు విరమణ ఒప్పందంపై సంతకం పెట్టాయి. తాజాగా చైనా ఈ అంశంలో  వేలు పెట్టింది. భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించి తానే ఈ యుద్ధాన్ని ఆపానని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది

ఆ దేశ విదేశాంగ మంత్రి వాంఘ్‌ యీ మాట్లాడుతూ " చైనా చాలా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించింది. మయన్మార్‌లో సందిగ్ధతలు, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, భారత్- పాకిస్థాన్ సమస్య, కంబోడియా-థాయిలాండ్ వివాదం, పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య గొడవ ఇలా ప్రపంచ దేశాల మధ్య గొడవలన మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాం" అని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.

అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. " మేము ఇదివరకే ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాం. భారత్-పాకిస్థాన్ అంశంలో మూడవ పార్టీ జ్యోక్యం లేదు. మా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం  రెండు దేశాల మధ్యలోనే జరిగిందని" భారత్ హెచ్చరించింది. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్‌కు మద్ధతుగా నిలిచింది. పాక్‌కు అవసరమైన యుద్ధ సామాగ్రిని, ఫైటర్‌ జెట్స్‌ అందించింది. ఆసమయంలో భారత్ చేసిన దాడులలో డ్రాగన్ కంట్రీకి చెందిన కొన్ని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)