Breaking News

‘నన్ను నాశనం చేసి.. లక్షలమందిని చంపి..’:పుతిన్‌ రహస్య కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 08/05/2025 - 12:51

మాస్కో: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అతని రహస్య కుమార్తె ఎలిజవేటా క్రివోనోగిఖ్(22) పలు సంచలన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అతను తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్నాడని  ఎవరిపేరు చెప్పకుండానే వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలు క్రెమ్లిన్‌(రష్యాన్‌ ప్రభుత్వ అధికార నివాసం) అధినేతపైనే అని మీడియా చెబుతోంది.

జర్మన్ వార్తాపత్రిక బిల్డ్‌ టెలిగ్రామ్‌ చానల్‌లో  ఎలిజవేటా క్రివోనోగిఖ్ వరుస పోస్ట్‌లను ఉంచారు. వాటిలో ఆమె ‘నా ముఖాన్ని మళ్లీ  ప్రపంచానికి చూపించడం అనేది నాకు విముక్తినిస్తుంది. నేను ఎవరో.. నా జీవితాన్ని ఎవరు నాశనం చేశారనేది నాకు గుర్తు చేస్తుంది’ అని పేర్కొంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఆమె ఖాతా  మాయమయ్యింది. 2003లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించిన క్రివోనోగిఖ్, పుతిన్, అతని మాజీ  ఉద్యోగి స్వెత్లానా క్రివోనోగిఖ్ కుమార్తె అనే వాదన వినిపిస్తుంటుంది.

2020లో రష్యన్ మిలియనీర్ స్వెత్లానా క్రివోనోగిఖ్ ఆస్తులపై దర్యాప్తు చేసిన సమయంలో ఎలిజవేటా క్రివోనోగిఖ్ రష్యన్ అధ్యక్షుడి రహస్య కుమార్తె అని  కనుగొన్నట్లు స్వతంత్ర మీడియా సంస్థ ప్రోక్ట్ పేర్కొంది. స్వెత్లానా క్రివోనోగిఖ్  ఈ  సంపదను రష్యన్ నాయకుని ద్వారా పొందారనే ఆరోపణలున్నాయి. స్వెత్లానా కుమార్తెకు పుతిన్‌ పోలికలున్నాయని ప్రోక్ట్ పేర్కొంది. అయితే, క్రెమ్లిన్ ఈ వాదనను తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది.  ఎలిజవేటా క్రివోనోగిఖ్ జనన ధృవీకరణ పత్రంలో ఆమె తండ్రి పేరు లేదు. 2021లో జరిగిన ఒక ఆడియో ఇంటర్వ్యూలో, ఎలిజవేటా క్రివోనోగిఖ్.. పుతిన్‌తో తనకున్న పోలికలను ధృవీకరించలేదు.  తిరస్కరించనూలేదు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)