Breaking News

ట్రంప్‌ కంటే బైడెన్‌ నయం: పుతిన్‌

Published on Fri, 02/16/2024 - 05:10

మాస్కో: తెంపరితనం, దూకుడుకు మారుపేరైన డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే జో బైడెన్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. రష్యా అధికారిక టీవీ ఛానెల్‌కు బుధవారం ఇచి్చన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్‌ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ రాబోయే అమెరికా ఎన్నికల్లో ఎవరు అధ్యక్షుడు అయినా వారితో రష్యా ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది.

రష్యా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ట్రంప్‌ కంటే బైడెన్‌ గెలిస్తేనే మంచిదని అనుకుంటున్నా. ఎందుకంటే ఉపాధ్యక్షుడిగానూ, అధ్యక్షుడిగానూ పనిచేసిన బైడెన్‌కు అనుభవం ఎక్కువ. పాతకాలం విధానాలను అవలంభించే నేత ఆయన. ఆయనను కొంత అంచనావేయొచ్చు కూడా. ట్రంప్‌ ఆలోచనలు అనూహ్యం’ అని అన్నారు. బైడెన్‌ ఆరోగ్యం సరిగా లేదంటూ వస్తున్న వార్తలపై పుతిన్‌ను ప్రశ్నించగా.. ‘ నేనేమీ డాక్టర్‌నుకాదు. అయి నా ఇలాంటి ప్రశ్నకు వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.

అయితే బైడెన్‌ ఆరోగ్య సమస్యలు వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపగలవు. నేను గమనించినంత వరకు బైడెన్‌ ఆరోగ్యంగానే ఉన్నారు. అధ్యక్షుడిగా కొనసాగే సత్తా ఆయనకు లేదు అని నేనైతే అనుకోను. పేపర్‌ వైపు చూసే ప్రసంగం చదువుతారనేది వాస్తవం. నేను కూడా కొన్ని సార్లు ప్రసంగపాఠాన్ని చూసే చదువుతా. అదేమంత పెద్ద విషయం కాదు. ఏదేమైనా బైడెన్‌ ప్రభుత్వ విధానాలు చాలా తప్పు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తోనే చెప్పా’’ అని పుతిన్‌ వెల్లడించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)