Breaking News

స్నేహ బంధం గెలిచినా.. విషాదం తప్పలేదు

Published on Mon, 05/26/2025 - 17:03

బంధాలన్నీ వేటికవే ప్రత్యేకం. బాల్యం నుంచి మొదలు కడదాకా స్నేహ బంధంలో కలిసి నడిచేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కాబట్టి ఆ బంధపు మాధుర్యం గురించి చెప్పుకుంటే పోతే బోలెడన్ని కబుర్లు. అయితే ఇక్కడ తమ మిత్రుడి కోసం ఇప్పటిదాకా ఎవరూ చేయని ప్రయత్నం చేశారు కొందరు విద్యార్థులు. ఈ ప్రయత్నంలో స్నేహ బంధం గెలిచినా.. విషాదం మాత్రం తప్పలేదు.

చైనా సిచువాన్‌ ప్రావిన్స్‌(Sichuan Province)లోని యిలాంగ్‌ మిడిల్‌ స్కూల్‌ విద్యార్థి రెన్‌(15).  ప్రాణాంతక క్యాన్సర్‌తో ఏడాది నుంచి చికిత్స తీసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయేసరికి.. చివరకు సొంతూరిలోనే ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కారణంగా అతని ఏడాది చదువు పోయింది. మరో నెలలో ఆ అకడమిక్‌ ఇయర్‌ ముగియనుంది. ఈలోపు.. రెన్‌కు చదువు చెప్పిన టీచర్‌కు ఓ ఆలోచన వచ్చింది. దానికి అతని క్లాస్‌మేట్స్‌, రెన్‌ తల్లిదండ్రులు అంగీకరించారు.

మే 17వ తేదీన.. బడి నుంచి కాలినడకన రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించి రెన్‌ (Ren) ట్రీట్మెంట్‌ తీసుకుంటున్న ఆస్పత్రికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి అతనికి యూనిఫాం తొడిగి బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంగణంలోనే అంతా కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఆపై అతను త్వరగా కోలుకోవాలంటూ పుష్ఫ గుచ్చాలతో పాటు కానుకలపై సంతకాలు చేసి మరీ అతనికి అందించారు. ఈ చర్యతో నెట్టింట జనం మురిసిపోయారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ, జరిగింది మరొకటి. 

గ్రూప్‌ ఫొటో దిగిన కొన్ని గంటలకే(ఆ మరుసటి ఉదయం) రెన్‌ కన్నుమూసినట్లు అతని తల్లిదండ్రులు ప్రకటించారు. ఈ విషాదాంతం అందరినీ షాక్‌కు గురి చేసింది. మరో నెలలో అతని 16వ ఏడులోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఈలోపు తుదిశ్వాస విడవడంతో ఆ తల్లిదండ్రులు, అతని స్నేహితులు గుండెలు అవిసేలా రోదించారు. 

ఈ గ్రాడ్యుయేషన్‌ ఫొటో(China Graduation Photo).. ప్రపంచంలోని అత్యుత్తమ ఫొటోగా నెట్టింట అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఆ మధుర క్షణం కోసమే అప్పటిదాకా అతని ఊపిరి ఆగిపోలేదేమోనని కొందరు కామెంట్‌ చేయగా.. వచ్చే జన్మలోనైనా ఆ చిన్నారి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని మరికొందరు కోరుకుంటూ నివాళులర్పిస్తున్నారు.

ఇదీ చదవండి: పాక్‌.. చివరకు ఇలా కూడా పరువు తీసుకుందా?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)