Breaking News

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. మూడు దేశాలకు షాక్‌

Published on Sun, 02/02/2025 - 07:24

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాలపై సుంకాలు విధించి అందరికీ ఝలక్‌ ఇచ్చారు. మెక్సికో, కెనడా, చైనా దేశాలపై టారిఫ్‌లు విధించారు. ఈ క్రమంలో దేశీయ తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆ సుంకాలను ఉపయోగిస్తామని ట్రంప్‌ హామీ ఇచ్చారు. దీంతో, ఆయన నిర్ణయంపై చర్చ నడుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. అధికారం చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఒకేసారి మూడు దేశాలపై సుంకాలను విధించారు. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధించినట్లు వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు సుంకాలను విధించే ఉత్తర్వుపై ట్రంప్‌ సంతకం చేశారు.

ఈ సందర్భంగా ట్రంప్‌.. ‘మెక్సికో, కెనడా దిగుమతులపై 25% సుంకం (కెనడియన్ ఎనర్జీపై 10%), చైనాపై 10% అదనపు సుంకాన్ని అమలు చేశాను. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) ద్వారా ఈ సుంకాలు విధించాను. మనం అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా నా కర్తవ్యం. అక్రమ విదేశీయులు, మాదకద్రవ్యాల వరద మన సరిహద్దుల గుండా ప్రవహించకుండా నిరోధించడానికి నేను నా ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అమెరికన్లు దీనికి అనుకూలంగా ఓటు వేశారు’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాదు.. కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం సంభవించే ప్రమాదం ఏర్పడింది. అలాగే, ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధి 1.5% తగ్గుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక, ట్రంప్ ఆదేశాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం 05:01 గంటలకు) సుంకాలు అమల్లోకి వస్తాయి. రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దులోకి ప్రవేశించే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉండనుంది. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని ట్రంప్‌ తెలిపారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)