Breaking News

అక్షరాలా ఊచకోతే!

Published on Sun, 01/11/2026 - 19:13

వాషింగ్టన్‌: అమెరికా ఇటీవల వెనెజువెలా రాజధాని కారకస్‌పై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికొలస్‌ మదురోను సతీసమేతంగా నిర్బంధించడం, న్యూయార్క్‌కు మెరుపువేగంతో తరలించిన ఘటనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత పెద్ద కిడ్నాప్, తరలింపు ఆపరేషన్‌ను అగ్రరాజ్యం కేవలం అరగంటలో ముగించిన తీరు చూసి ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది. అయితే అమెరికా స్పెషల్‌ ఫోర్సెస్‌ ఆ సందర్భంగా మదురో అంగరక్షకులను, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని అక్షరాలా ఊచకోతే కోశాయట! 

రంగంలోకి దిగింది కేవలం 20 మందే అయినా వందలాది మంది రక్షణ సిబ్బందిని పిట్టల్లా కాల్చి చంపారట. ఆ సమయంలో విధుల్లో ఉన్న మదురో సెక్యూరిటీ సిబ్బందిని ఉటంకిస్తూ అమెరికా అధికార భవనం వైట్‌హౌస్‌ ప్రెస్‌ మహిళా సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ శనివారం ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘మీరు ఏం చేస్తున్నా సరే, అర్జెంటుగా ఆపేసి ఇదోసారి చదవండి...’ అంటూ క్యాప్షన్‌ కూడా జోడించారు. అప్పుడేం జరిగిందో సదరు సెక్యూరిటీ గార్డు ఇంటర్వ్యూ తరహాలో చెప్పుకొచ్చారు. ‘‘అంతా హఠాత్తుగా మొదలైంది. 

ఉన్నట్టుండి మా రాడార్‌ వ్యవస్థలన్నీ మూగబోయాయి. ఏమైందా అని చూస్తుండగానే మా మీదుగా అసంఖ్యాకంగా డ్రోన్లు ఎగరసాగాయి. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఎలా స్పందించాలో తెలియక మేం తికమక పడుతుండగానే హెలికాప్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటినుంచి దాదాపు 20 మంది సైనికులు దిగారు. మేం చాలామందిమి ఉన్నా వారి దగ్గరున్న అత్యాధునిక ఆయుధాల ముందు మా సంఖ్యా బలం ఎందుకూ కొరగాకుండా పోయింది. మా జీవితంలో అలాంటి వారితో అప్పటిదాకా ఎప్పుడూ పోరాడలేదు. నేలపై కాలు పెట్టిన క్షణం నుంచీ వారు అక్షరాలా ఊచకోతకు దిగారు. అత్యంత వేగంగా, అంతకుమించిన కచ్చితత్వంతో కాల్పులు సాగించారు. ఒక్కొక్కరూ నిమిషానికి కనీసం ఏకంగా 300 రౌండ్లకు పైగా కాల్చారు’’ అని చెప్పుకొచ్చాడు.

జీవాయుధమా?
దాడి సందర్భంగా అమెరికా సైనికులు తామె న్నడూ చూడని ఒక అత్యాధునిక ఆయుధాన్ని సైతం ఉపయోగించినట్లు మదురోకు రక్షణ విధుల్లో ఉన్న భద్రతాసిబ్బందిలో ఒకరు చెప్పడం విశేషం. ‘‘ ఆ అత్యాధునిక ఆయుధం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన శబ్ద తరంగాలు వెలువడ్డాయి. వాటి తీవ్రతకు నా తల బద్దలవుతుందా అనిపించింది. మా ముక్కులోంచి రక్తం కారసాగింది. కొందరైతే రక్తం కక్కుకున్నారు. ఆ శబ్దం దెబ్బకు కదల్లేని పరిస్థితిలోకి జారుకున్నాం. వాళ్లలో కనీసం ఒక్కరంటే ఒక్కరిని కూడా కనీసం గాయపరచలేకపోయాం. మాలో వందల మందిని పొట్టన పెట్టుకున్నారు’’ అని వివరించారు. ‘‘అమెరికాతో పోరాడగలమని ఇప్పటికీ నమ్ముతున్న లాటిన్‌ అమెరికా దేశాలన్నింటికీ ఒకటే చెబుతున్నా. అమెరికా సైనిక సామర్థ్యం గురించి మీకసలు ఏమీ తెలియదు’’ అంటూ సదరు గార్డు హెచ్చరికలు కూడా చేయడం విశేషం.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)