Breaking News

పుతిన్‌కు ఉచ్చు బిగిస్తున్న అమెరికా.. రష్యాకు డబుల్ స్ట్రైక్

Published on Wed, 07/29/2026 - 07:40

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ తొలి ఆమోదం తెలిపింది. బిల్లును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు నిర్వహించిన విధానపరమైన (ప్రొసీజరల్) ఓటింగ్‌లో 86-12 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందింది. దీంతో ఈ బిల్లుపై సెనేట్‌లో పూర్తి స్థాయి చర్చకు మార్గం సుగమమైంది.

ఈ కీలక ఓటింగ్ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ అమెరికా క్యాపిటల్ భవనానికి హాజరయ్యారు. ఇటీవల మరణించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లిన జెలెన్‌స్కీ, ఓటింగ్‌కు ముందు పలువురు రిపబ్లికన్, డెమోక్రాటిక్ సెనేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం సెనేట్ గ్యాలరీలో కూర్చొని ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు.

సెనేటర్లతో సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ప్రస్తుతం కీలక పురోగతి సాధిస్తోందని, అయితే విజయం సాధించాలంటే అమెరికా నుంచి మరింత సైనిక, ఆర్థిక, రాజకీయ మద్దతు అవసరమని తెలిపారు. ఈ ఆంక్షల బిల్లు ఉక్రెయిన్ ప్రజలకు నైతిక బలాన్ని ఇవ్వడమే కాకుండా, రష్యాపై అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచుతుందని ఆయన పేర్కొన్నట్లు సమావేశానికి హాజరైన సెనేటర్లు వెల్లడించారు. కాగా, ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రాటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ సంయుక్తంగా రూపొందించారు. జూలై 10న వైట్ హౌస్‌తో ఈ బిల్లుపై ఒప్పందానికి వచ్చిన మరుసటి రోజే గ్రాహమ్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణానికి ముందు ఉక్రెయిన్ వెళ్లి జెలెన్‌స్కీతో కూడా సమావేశమయ్యారు. ఈ బిల్లు గ్రాహమ్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన వారసత్వంగా నిలుస్తుందని బ్లూమెంథల్ పేర్కొన్నారు.

బిల్లులోని ముఖ్యాంశాలు:

  • రష్యా నుంచి చమురు, సహజ వాయువు, ఇతర ఎగుమతులను కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశం.

  • పుతిన్‌తో పాటు రష్యా ఉన్నత రాజకీయ, సైనిక నాయకులు, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపై కొత్త ఆంక్షలు.

  • ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న పాత చమురు ట్యాంకర్లపై కూడా చర్యలు.

  • జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా మినహాయించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించే నిబంధన.

అయితే అధ్యక్షుడికి అదనపు టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రాటిక్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలను సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సవరణలపై చర్చ అనంతరం బిల్లుపై అమెరికా సెనేట్‌లో తుది ఓటింగ్ జరగనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా యుద్ధ ఆర్థిక వనరులపై గట్టి దెబ్బ పడటంతో పాటు, ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)